Begin typing your search above and press return to search.

ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ-టీడీపీ బ‌లాబ‌లాలు ఇవే!

By:  Tupaki Desk   |   26 July 2021 2:51 AM GMT
ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ-టీడీపీ బ‌లాబ‌లాలు ఇవే!
X
ఏలూరు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలిసిపోయాయి. అనేక మ‌లుపులు తిరిగిన ఇక్కడి ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో ఆఖ‌రి అంకం.. ఈ రోజు వెల్ల‌డైంది. ఈ కార్పొరేష‌న్‌ను కూడా అధికార పార్టీ వైసీపీనే ద‌క్కించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన అంచ‌నాల మేర‌కు.. వైసీపీ 20, టీడీపీ 2 డివిజన్లలో విజయం సాధించాయి. 2, 33, 38, 39, 41, 42, 45, 46, డివిజన్లలో వైసీపీ గెలుపొందగా.. 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి.

మార్చి 10న 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైసీపీ 47, టీడీపీ 43, జనసేన 19, బీజేపీ 14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ పడ్డారు. ఏలూరు కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మార్చి 10న 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైకాపా 47, తెదేపా 43, జనసేన 19, భాజపా 14, స్వతంత్రులు 39 స్థానా ల్లో పోటీ పడ్డారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో 56.82 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,32,972 మంది కాగా.. 1,12,520 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఏలూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, జాబితా సక్రమంగా లేదని పలు రాజకీయ పార్టీల నాయకులు, కొన్ని ప్రజా సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో విలీనం చేసిన ఏడు పంచాయతీల ఓటర్లను 50 డివిజన్లలో కూర్పు చేయగా.. చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయని.. ఓ ప్రాంతంలో ఉన్న ఓట్లను సంబంధం లేని ఇతర ప్రాంతాల్లో చేర్చారని, జాబితాను మార్పు చేయాలని అప్పటివరకు ఎన్నికలు నిలుపుదల చేయాలని కోరారు.

దీంతో మార్చి 10న జరగాల్సిన ఎన్నికలను నిలుపుదల చేయాలని న్యాయస్థానం అదే నెల 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయడంతో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఓట్ల లెక్కింపును నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లెక్కింపు వాయిదా పడింది. తాజాగా మ‌రోసారి ఈ విష‌యంపై దృష్టి పెట్టిన హైకోర్టు.. కౌంటింగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.