Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ తో సైడ్​ ఎఫెక్ట్స్​ ఇవే..!

By:  Tupaki Desk   |   22 Nov 2020 2:30 AM GMT
కరోనా వ్యాక్సిన్ తో సైడ్​ ఎఫెక్ట్స్​ ఇవే..!
X
ప్రపంచమంతా కరోనా మహమ్మారి దెబ్బకు అట్టుడుకుతున్నది. వ్యాక్సిన్​ తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్​ పూర్తిచేసుకున్నాయి. తొందర్లోనే చివరి ట్రయల్స్​ పూర్తిచేసుకొని మార్కెట్ లోకి వచ్చేందుకు కొన్ని వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్నాక కొన్ని సైడ్​ఎఫెక్ట్స్​ ఉండే అవకాశం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ట్రయల్స్​ వేసినప్పడు చాలామందిలో దుష్ర్ప‌భావాలు కనిపించాయి. కరోనా వ్యాక్సిన్​తో వచ్చే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.. సోమవారమే మోడెర్నా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. మరోవైపు ఫైజర్ కూడా మూడో దశ ట్రయల్ ఫలితాల డేటాను రిలీజ్ చేసింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, డ్రగ్ మేకర్ అస్ట్రాజెనికా కూడా తమ రెండో దశ ట్రయల్ వ్యాక్సిన్ ఫలితాలను వెల్లడించింది. ఈ మూడు కరోనా వ్యాక్సిన్లు రోగనిరోధకతను పెంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని ఫలితాల్లో వెల్లడైంది. కానీ, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మాత్రం మూడో ట్రయల్ డేటాలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఏదిఏమైనా ఈ వ్యాక్సిన్ ప్రజలతో సహా అందరికి ఈ ఏడాది ఆఖరిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మోడెర్నా వ్యాక్సిన్​ వేయించుకున్నవారిలో.. అలసట, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వ్యాక్సిన్ వేసిన ప్రాంతంలో ఎర్రపారడం వంటి లక్షణాలు కనిపించినట్టు వైద్యులు తెలిపారు.

పైజర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆక్స్​ఫర్డ్​ తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​తో అలసట, జ్వరం, కండరాల నొప్పులు, వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్టు వైద్యులు తెలిపారు.

సైడ్​ఎఫెక్ట్స్​ ఎందుకొస్తాయి..

సాధారణంగా వ్యాక్సిన్​లు వేసినప్పుడు మన శరీరంలోని టీ సెల్స్​ యాక్టివ్​గా మారతాయి. దాంతో శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో కొందరికి సైడ్​ఎఫెక్ట్స్​ వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవన్నీ సాధారణమైనవే కావడంతో వ్యాక్సిన్​ ట్రయల్స్​లో ముందుకెళ్తారు. శరీరంలో ఏదైనా అసాధారణ మార్పు జరిగితే శాస్త్రవేత్తలు వెంటనే క్లినికల్​ ట్రయల్స్​ను నిలిపివేస్తారు. ప్రస్తుతం మోడెర్నా, పైజర్ వ్యాక్సిన్లకు సైడ్​ ఎఫెక్ట్స్​ ఎక్కువగా కనిపిస్తున్నట్టు సమాచారం.