వీడిని ఎంత దారుణంగా చంపేసినా తప్పు ఉండదు

Wed Jul 21 2021 09:27:09 GMT+0530 (IST)

There is nothing wrong with killing badly that person

అవును.. వినేందుకే వికారంగా అనిపించే ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. నిజానికి ఇలాంటి వికారపు విషయాల్ని వీలైనంతగా సెన్సార్ చేయాల్సిన అవసరం ఉంది.కానీ.. సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల్ని రికార్డు చేయాల్సిన గురుతర బాధ్యత మీడియా మీద ఉంది. అంతేకాదు.. మన చుట్టు ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కలగటంతో పాటు.. కొన్ని కఠినమైన చట్టాల్ని వెంటనే తీసుకురావాల్సిన అవసరాన్ని చాటి చెప్పేందుకు వీలుగా.. ఇప్పుడు చెప్పే ఉదంతాల్ని చెప్పక తప్పటం లేదు. ఆకర్షణీయమైన హెడ్డింగులు పెట్టి.. పక్కాదారి పట్టించటం మాకు ఇష్టం ఉండదు.అలా అని విన్నంతనే జగుప్స కలిగించే ఉదంతాల్ని మరింత స్పైసీగా.. అంతకు మించిన సంచలనంగా చిత్రీకరిస్తూ రాతలు రాయటానికి మేం వ్యతిరేకం. ఎందుకంటే.. కొన్ని సున్నితమైన అంశాల్ని వీలైనంత సున్నితంగా చెప్పాలే తప్పించి.. మొరటు భాషతో చెప్పటం మంచిది కాదు. ఇంతకీ మేం చెప్పబోయే వికారపు విషయం ఏమంటే..కన్న కూతురిని ఒక పిశాచి (తండ్రి రూపంలో) అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అది కూడా గడిచిన ఆర్నెల్లుగా. ఇలాంటి త్రాష్టుడ్ని ఏం చేయాలి చెప్పండి?

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది. ఈ దారుణ సంచలన ఉదంతానికి సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాల్ని చూస్తే.. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలోని అంజయ్య తన భార్యతో విడిపోయాడు. పెళ్లైన ఒక కొడుకు.. ఒక కుమార్తె సంతానం కలిగిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తనకు పుట్టిన పిల్ల కాకున్నా.. వరుసకు కూతురు అయ్యే అమ్మాయి మీద కన్నేశాడు. గడిచిన ఆర్నెల్లుగా అదిరించి.. బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తన మీద జరుగుతున్న ఆరాచకపు దాడి గురించి కన్నతల్లికి చెప్పుకున్నా.. ఫలితం లేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. ఈ దారుణాన్ని చూసిన పదేళ్ల కొడుకు బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో.. ఈ కామాంధుడి దారుణాలు బయటకు వచ్చాయి. దీంతో.. అతగాడు పరారయ్యాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఇలాంటోడ్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.