Begin typing your search above and press return to search.

బద్వేల్ తేడా కొడుతుందా... ?

By:  Tupaki Desk   |   28 Oct 2021 12:30 PM GMT
బద్వేల్ తేడా కొడుతుందా... ?
X
మరి ముప్పయి ఆరు గంటల్లో ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక పోరు ఉంది. బద్వేల్ కడప జిల్లాలో ఉంది. పైగా అది ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా. ఇక బద్వేల్ లో 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 44 వేల పై చిలుకు మెజారిటీ సాధించింది. అందువల్ల బద్వేల్ విషయంలో ఏపీలో ఎలాంటి రాజకీయ ఉత్కంఠ లేదు, పైగా ఇది ముందే తెలిసిపోయిన ఫలితం. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బద్వేల్ బరి నుంచి తప్పుకున్నాక చప్పగానే ఈ ఎన్నిక ప్రచారం సాగింది. అందరి దృష్టి తెలంగాణాలోని హుజూరాబాద్ మీద ఉంది, దాని ఫలితం మీదనే జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. మరి ఇంత సాఫీగా లో ప్రోఫైల్ లో సాగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక రిజల్ట్ విషయంలో డౌట్లు లేకపోయినా మెజారిటీ ఎంత వస్తుంది అన్న చర్చ మాత్రం ఉంది. వైసీపీకి సరైన అభ్యర్ధి టీడీపీ పోటీలో ఉన్నపుడే 44 వేల మెజారిటీ వచ్చింది. ఇపుడు బీజేపీ, కాంగ్రెస్ నుంచే నామమాత్రం పోటీ ఉందని అంతా భావిస్తున్న క్రమంలో వైసీపీ లక్ష ఓట్ల మెజారిటీ కోసం గేలం వేస్తోంది.

మరి అంత మెజారిటీ వస్తుందా అంటే ఓటింగ్ ఎలా జరుగుతుంది అన్న దాని మీదనే అది ఆధారపడి ఉంది. ఇంకో వైపు బద్వేల్ లో బీజేపీని చాలా లైట్ గా అధికార పార్టీ తీసుకుంటోంది. ముందు డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు, అంతలా ఎగిరెగిగి పడవద్దు అంటూ వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం వేళ గట్టిగానే మాట్లాడారు, అయితే మొదట్లో బీజేపీ చాలా బలహీనమే అయినప్పటికీ పోలింగునకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఎంతో కొంత పుంజుకుంది అన్న అనుమానాలు కలుగుతున్నాయట. దానికి కారణం తెర వెనక మద్దతు అంటున్నారు. బయటకు చెప్పకపోయినా టీడీపీ, జనసేన లోపాయికారీగా బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. దీన్నే ఇపుడు అధికార పార్టీ నేతలు కూడా గమనించడంతో వారిలో మెజారిటీ మీద సందేహాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేయడం వెనక ఉన్న సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు. బద్వేల్ లో బీజేపీకి టీడీపీ మద్దతు కోసమే ఈ ఫోన్ అంటున్నారు. చంద్రబాబు మెత్తపడితే టీడీపీ నుంచి బీజేపీకి కావాల్సిన మద్దతు దక్కుతుందన్నదే ఆలోచనట. ఇక టీడీపీ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి సాగాలని అనుకుంటోంది. ఆ క్రమంలో బద్వేల్ లో బీజేపీకి కనీసం డిపాజిట్లు అయినా తెప్పించడం ద్వారా తాము మద్దతు ఇచ్చామని చెప్పుకోవడం ఇక్కడ ప్రధానమైంది అంటున్నారు. అలాగే మరో వైపు చూసుకుంటే జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇస్తోంది అంటున్నారు. బీజేపీ బాగా ఓట్లు తెచ్చుకుంటే కచ్చితంగా అధికార పార్టీ మీద దాని ప్రభావం పడుతుంది. పైగా గతంలో వచ్చిన 44 వేల ఓట్ల మెజారిటీని తగ్గించాలని కూడా మాస్టర్ ప్లాన్ లో విపక్షాలు ఉన్నాయట. బీజేపీకి కనుక ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వస్తే కనుక కచ్చితంగా మూడు పార్టీల మధ్య ఉన్న తెలియని బంధమే ఇలా చేసిందని అనుకోవచ్చుట. మొత్తానికి ఉమ్మడి శత్రువు వైసీపీని దెబ్బ తీసేందుకు బద్వేల్ వేదికగా భారీ యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. మరి మెజరిటీ కనుక తేడా కొడితే మాత్రం వైసీపీకి అది ఇబ్బందికరమే అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.