Begin typing your search above and press return to search.

యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఏం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   12 May 2021 12:30 PM GMT
యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఏం జరిగిందంటే?
X
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జడలు చాస్తోంది. భారతదేశంలో రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. వైరస్ ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కార మార్గమని నిపుణులు చెప్పారు. కాగా దాదాపు అన్ని దేశాల్లో టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నారు. తొలుత వ్యాక్సిన్ పట్ల ప్రజలు నిరాసక్తత కనబర్చినా... మహమ్మారి కోరలు చూసి భయంతో టీకా కోసం ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకేసారి ఆరు డోసుల టీకా ఇచ్చారు.

ఇటలీకి చెందిన ఓ యువతి వ్యాక్సిన్ కోసం టస్కాన్సీలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఒకేసారి ఆమెకు ఆరు డోసుల టీకా ఇచ్చారు. ఇదేదో ప్రయోగాత్మకంగా కాదు.. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఒకేసారి ఆరు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆ యువతి అస్వస్థకు గురైంది.

బాధితురాలని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమెలో జరిగే మార్పులను నిత్యం గమనిస్తూ చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే పొరబాటు గ్రహించడం వల్ల ప్రమాదం లేదని చెప్పారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.

తాను చేసిన తప్పును నర్సు అంగీకరించారు. ఎలాంటి దురుద్దేశం లేదని ఆమె చెప్పారు. అనుకోకుండానే ఈ తప్పిదం జరిగిందని వివరించారు. ఈ పొరపాటు పట్ల ఆస్పత్రి వర్గాలు బాధ్యత వహించాయి. యువతికి పూర్తి వైద్యం అందించింది. ఆరు డోసుల టీకా ఒకేసారి ఇచ్చినా పెద్దగా ప్రమాదం జరగలేదని వైద్యులు తెలిపారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు.