Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుడి ఆస్తి 17లక్షల కోట్లు ఖతం

By:  Tupaki Desk   |   6 March 2021 4:58 PM GMT
ప్రపంచ కుబేరుడి ఆస్తి 17లక్షల కోట్లు ఖతం
X
ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడుగా ఇటీవల అవతరించి మళ్లీ వెనుకబడిపోయాడు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్. తాజాగా ఈయన నేతృత్వంలోని కంపెనీకి గట్టి షాక్ తగిలింది.గత 4 వారాల వ్యవధిలో ఈ కార్ల తయారీ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా రూ.17 లక్షల కోట్లకుపైనే తగ్గిపోయింది.శుక్రవారం ఈ సంస్థ షేర్లు గత ఏడాది డిసెంబర్ 3 కంటే అత్యల్ప విలువను నమోదు చేశాయి. ఈ ఏడాది జూన్ లో టెస్లా మార్కెట్ విలువ రూ.61 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం ఆ వేల్యూ రూ.43 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో మస్క్ ఏకంగా 3వ స్థానానికి దిగజారాడు.

ఒకే ఒక్క ట్వీట్ తో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మొన్నీ మధ్యనే 15 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో (రూ.1.10 లక్షల కోట్లు) కోల్పోయాడు. సాధారణంగా బిట్ కాయిన్ కు అనుకూలంగా ట్వీట్లు చేసే మస్క్.. గత వారం ఎథర్ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని తాజాగా ట్వీట్ చేశాడు. అదే ఆయనపై మదుపర్లలో విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది.దీంతో వెంటనే స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ విలువ 8.6శాతం పడిపోయింది. 2020 సెప్టెంబర్ తర్వాత టెస్లా షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.