Begin typing your search above and press return to search.

తగ్గెదెలే.. ప్రపంచ మిలిటరీ బడ్జెట్ 2లక్షల కోట్లపైనే..!

By:  Tupaki Desk   |   30 Jan 2023 11:25 AM GMT
తగ్గెదెలే.. ప్రపంచ మిలిటరీ బడ్జెట్ 2లక్షల కోట్లపైనే..!
X
ఆధునిక యుగంలోనూ రక్షణ కోసం ఆయా దేశాలు ఖర్చు చేస్తున్న వ్యయం ప్రతి యేటా పెరుగుతూ పోతుంది. ఆయుధ సంపత్తిని.. సైన్యాన్ని సమకూర్చుకునేందుకు అన్ని దేశాలు ఆసక్తి చూపుతుండటంతో ఆ మేరకు మిలిటరీ ఖర్చు సైతం నానాటికీ పెరిగిపోతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది ఇరు దేశాలకు నష్టమే తప్ప లాభం చేకూరదని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ స్వీయ రక్షణలో భాగంగా అన్ని దేశాలు మిలిటరీ కోసం యేటా వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ వార్ తర్వాత అన్ని దేశాలు ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా అణ్వాయుధాలు.. డ్రోన్ టెక్నాలజీపై.. యాంటీ మిస్సైల్ రాకెట్ల లాంఛింగ్ వంటి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ మిలిటరీ బడ్జెట్ 2.1లక్షల కోట్ల డాలర్లకు చేరిందని స్వీడన్ కు చెందిన 'స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్' ఒక నివేదికలో వెల్లడించింది.

1949 సంవత్సరం నుంచి వివిధ దేశాల మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్లను ఈ సంస్థ ప్రతి యేటా విశ్లేషిస్తోంది. మిలిటరీ అంటే కేవలం సైన్యాన్ని పోషించడం.. ఆయుధాలను సమకూర్చుకోవడం మాత్రమే కాకుండా పరిశోధనపై పెడుతున్న ఖర్చు సైతం ఇందులో భాగమేనని పేర్కొంది. ప్రపంచ మిలిటరీ వ్యయం గత ఏడేళ్లుగా పెరుగుతూ 2021-22 సంవత్సరానికి 2.1లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా వాటా సుమారు 38 శాతం కాగా 2021-22 లో ఆ దేశం మిలిటరీ కోసం 80 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ప్రపంచ మిలిటరీలో చైనా వాటా 14 శాతం కాగా 2021-22 లో ఆదేశం 29.3వేల కోట్ల డాలర్లను మిలిటరీ కోసం వ్యయం చేసినట్లు వెల్లడించింది. ఈ రెండు దేశాల మిలిటరీ వ్యవసాయం ప్రపంచంలోని మొత్తం దేశాల మిలిటరీ వ్యయం కంటే కూడా కాస్త ఎక్కువని వెల్లడి కావడం గమనార్హం. ఇక మూడో స్థానంలో భారత్ ఉంది. మిలిటరీ కోసం భారత్ ప్రపంచ మిలిటరీ వ్యయంలో 3.6 శాతం ఖర్చు చేస్తోంది. ఇందుకోసం మన దేశం 7.66వేల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తుందని తేలింది.

నాలుగో స్థానంలో యూకే 3.2శాతంతో ఉంది. ఆ దేశం 6.84కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఐదో స్థానంలో రష్యా 3.1శాతంతో ఉంది. రష్యా మిలిటరీ కోసం 6.69 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఆరో స్థానంలో ఫ్యాన్స్ 2.7 శాతంతో 6.84 కోట్లు ఖర్చు చేసింది. ఏడో స్థానంలో జర్మనీ దాదాపు ఫ్రాన్స్ సమానంగా ఖర్చు పెట్టింది. ఎనిమిదో స్థానంలో సౌదీ అరేబియా 2.6శాతం వాటాతో 5.56కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. తొమ్మిదో స్థానంలో జపాన్ 2.6శాతం వాటాతో 5.4కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. పదో స్థానంలో దక్షిణ కొరియా 2.4శాతం వాటాతో 5.02కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినట్టు పేర్కొంది.

పైన పేర్కొన్న టాప్ 10లోని దేశాలు మినహా మిగిలిన ప్రపంచ దేశాల మిలిటరీ వ్యయం మొత్తం 53.6వేల కోట్ల డాలర్లు కాగా ఈ వాటా 25.3శాతంగానే ఉందని తేలింది. మరోవైపు మిలిటరీ బడ్జెట్ ను గత పదేళ్లలో గణనీయంగా పెంచుకుంటూ పోతున్న దేశం మాత్రం చైనానే. 2012లో ఆ దేశం మిలిటరీ వ్యయంతో పోలిస్తే 2021లో చైనా ఖర్చు పెట్టిన బడ్జెట్ రెట్టింపు అయింది. గత 27 ఏళ్లుగా చైనా తన రక్షణ కోసం బడ్జెట్ ను పెంచుకుంటూ పోతూనే ఉందని స్టాక్ హోం నివేదికలో వెల్లడి కావడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.