వైరస్ మారుతోంది.. కొత్త వ్యాక్సిన్ లు రావాలా?

Tue Aug 11 2020 10:45:50 GMT+0530 (IST)

The virus is changing Should new vaccines come?

మాయదారి కరోనా వైరస్ ధాటికి  ప్రపంచమే తలకిందులవుతోంది. ఏం చేయాలో పాలుపోక జనాలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మందు లేక.. వ్యాక్సిన్ రాక జనాలు ఆగమాగం అవుతున్నారు. వ్యాక్సిన్ వస్తేనే దీన్ని వ్యాప్తికి అడ్డుకట్టపడగలదు.వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. అంటే తనను తాను మార్చుకుంటోంది. దీంతో ఇప్పుడు తయారు చేసే వ్యాక్సిన్ లు పనిచేయవన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో నెలకొంది.

వైరస్ రూపాంతరం చెందిన వ్యాక్సిన్ పనిచేయదు. ఆ మారిన వైరస్ కోసం మరో వ్యాక్సిన్ తయారు చేయాలి. ఇది వరకు ఇన్ ఫ్లూయోంజా వైరస్ కు 1930లోనే టీకా కనిపెట్టినా అది 1990 వరకు అత్యంత వేగంగా మార్పు చెందింది. దీంతో దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ ను మార్పు చేయాల్సి వస్తోంది. కరోనాకు సైతం ఇలానే తరుచుగా వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక కరోనా వైరస్ చైనాలో పుట్టిన దానికి ఇప్పుడు వ్యాపిస్తున్న దానికి చాలా మార్పులు చోటుచేసుకుంది.  దీంతో వ్యాక్సిన్ వచ్చినా వైరస్ మారితే అది పనిచేసే అవకాశం ఉండదు.. దీంతో అప్పుడు మళ్లీ వ్యాక్సిన్ లో మార్పులు చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.