Begin typing your search above and press return to search.

ఏపీలో ఒక్కో పురుషుడు నలుగురు స్త్రీలతో శృంగారం.. తెలంగాణలో ఎంతంటే?

By:  Tupaki Desk   |   16 May 2022 11:30 AM GMT
ఏపీలో ఒక్కో పురుషుడు నలుగురు స్త్రీలతో శృంగారం.. తెలంగాణలో ఎంతంటే?
X
ఆంధ్రాలో మగాళ్లు శృంగారాన్ని అనుభవించడంలో ఆరితేరిపోయారు. ఆంధ్రా మగాళ్లు దక్షిణాది రాష్ట్రాల పురుషుల కంటే ఆ విషయంలో ఉత్సాహం కనబరుస్తారని తెలిసింది. ఇతర రాష్ట్రాల పురుషులు కంటే కూడా ఆంధ్రా పురుషులు తమ జీవిత కాలంలో కనీసం నలుగురు మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం.

ఏపీలో పురుషుల శృంగార వాంఛ ఎక్కువని సర్వేలో తేలింది. ఒక మగాడు కనీసం నలుగురు మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన సర్వేలో తేలింది. జీవితకాలంలో ఎంతమందితో లైంగిక సంబంధాలను కలిగి ఉన్నారనే ప్రశ్నకు సగటున నలుగురు అనే సమాధానం వచ్చిందట.. సర్వేలో పాల్గొన్న ఆంధ్రా పురుషుల్లో ఒక్కొక్కరు తమకు నలుగురు భాగస్వాములు ఉన్నారని తెలిపారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫేజ్ 5ని 2020-21 మధ్య నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న ఆంధ్రా అబ్బాయిల్లో చాలా మంది తమకు ఒకరికంటే ఎక్కువమంది లైంగిక భాగస్వాములు ఉన్నట్లు ఒప్పుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాల పురుషులతో పోలిస్తే ఆంధ్రా మగాళ్లే ఈ విషయంలో ముందున్నారట.. జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే 5లో రెండో విడతలో ఈ విషయం తేలింది. ఆంధ్రా మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ మందితో సంబంధాలుకలిగి ఉన్నామని ఒప్పుకున్నారు.

తమ జీవితకాలంలో ఎంతమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారనే ప్రశ్నకు మహిళల సగటు 1.4గా ఉంటే.. పురుషుల సగటు 4.7గా ఉంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలోనే పురుషులకు ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్నారు.

ఇక ఆంధ్రా తర్వాత స్థానంలో తెలంగాణ పురుషులు ఉండడం విశేషం. తెలంగాణ పురుషులకు సగటున ముగ్గురితో సంబంధం ఉందని తేలింది. కర్ణాటకలో 2.7 మందితో, అండమాన్ నికోబార్ లో 2.8గా కేరళ, లక్ష ద్వీప్ లో మాత్రం జీవితకాలంలో ఒక్కరితోనే లైంగిక సంబంధం ఉందని తేలింది. పుదుచ్చేరి, తమిళనాడు పురుషుల్లో ఈ సగటు 1.2, 1.8గా ఉంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో లైంగిక సంక్రమణ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాప్తి, స్త్రీ పురుషుల్లో లైంగికదోరణులపై అభిప్రాయాలను కేంద్రం సేకరించింది. 15-49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ-పురుషుల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించారు. ఏపీలో సర్వేలో పాల్గొన్న వారిలో 2శాతం మంది గత ఏడాది కాలంలో ఇద్దరికంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్నట్టు ఒప్పుకున్నారు. 3.8 శాతం మంది తమ జీవిత భాగస్వామి లేదా బయట వారితో శృంగారంలో పాల్గొన్నట్లు అంగీకరించారు. రెండో దశ సర్వే ను 2020 జనవరి 2 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో నిర్వహించినట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది.