డేంజర్ బెల్స్: టీకాలు వేసుకున్న వ్యక్తులతోనే వైరస్ వ్యాప్తి

Sun Aug 01 2021 06:00:01 GMT+0530 (IST)

The virus is spread by people who have been vaccinated

కరోనా వైరస్ సెకండ్ థర్డ్ వేవ్ లంటూ విరుచుకుపడుతూనే ఉంటుంది. టీకాలు వేస్తే తగ్గుముఖం పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఇది ప్రస్తుతం ప్రభుత్వాల ప్రణాళికలను పూర్తిగా గందరగోళానికి గురిచేస్తోంది. తాజాగా కొత్త అధ్యయనం వివరాలను అమెరికా ఆరోగ్య అధికారులు శుక్రవారం బయటపెట్టారు.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నుంచి తాజా పరిశోధన ప్రకారం అందరినీ గుబులు పుట్టిస్తోంది... కోవిడ్19 బారినపడి కోలుకున్న వారు టీకాలు వేసుకున్న వ్యక్తులే ఇప్పుడు కరోనా వాహకాలుగా మారుతున్నారట.. వారు కరోనాను జయించడంతో ఇమ్యూనిటీ కలిగి ఉంటారు. వారికి వచ్చినా పెద్ద ప్రమాదం ఏమీ ఉ:డదు.. సో అలాంటి వారి ద్వారానే కరోనా టీకాలు వేసుకోని వారికి వైరస్ సోకుతోందని.. పెద్ద మొత్తంలో విస్తరిస్తోందని తేలింది.

సీడీసీ ఫ్లాగ్ షిప్ వీక్లి నివేదికలో ప్రచురించబడిన ఈ అధ్యయనం ఇటీవల సిఫార్సులు ఏవీ పనిచేయవని అర్థమవుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులే అధికంగా కరోనా వ్యాప్తి చేస్తున్నారని.. ఇంటి లోపల కూడా వీరు మాస్కులు ధరించాలని నివేదిక సూచించింది. డెల్టా వేరియంట్ కు వీరు వాహకాలుగా మారి అందరికీ వ్యాపింపచేస్తున్నారని చెబుతున్నారు.

టీకా వేసుకున్న వారు ఇక మాస్క్ అవసరం లేదని తిరగకుండా పబ్లిక్ ప్లేసుల్లో ఇంట్లో కూడా మాస్కులు ధరించాలని నివేదిక సూచిస్తోంది. మసాచుసెట్స్ లోని కేప్ కాడ్ లోని ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన ప్రొవిన్స్ టౌన్ లో కరోనా వ్యాప్తికి గల కారణాలపై పరిశోధన చేశారు. జూలై నెలలో పట్టణానికి వెళ్లిన మాసాచుసెట్స్ నివాసితుల్లో 469 మందికి కోవిడ్ సోకింది. పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు ఇందులో మూడో వంతు దాదాపు 74శాతం కేసులు గుర్తించారు. టెస్టింగుల్లో 133మంది రోగుల నుంచి 90శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ను గుర్తించారని నివేదిక తెలిపింది.

పూర్తిగా టీకాలు వేసినవారు తీసుకోని రోగులకు వైరస్ ను అంటిస్తున్నట్టుగా నివేదికలో సంచలన విషయం బయటపడింది. టీకాలు వేసుకున్న వారికి పెద్దగా వైరస్ ప్రభావం చూపడం లేదని.. అందులో కేవలం నలుగురు (1.2శాతం) మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారని.. మరణాలు లేవని నివేదిక తెలిపింది.

డెల్టా వేరియంట్ కేసులు ఇప్పుడు అమెరికాలో పెరిగిపోయాయి. అమెరికాలో ప్రవేశించిన తర్వాత ఈ కేసులు ఎక్కువయ్యాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం ఎంత యుద్ధం చేస్తున్నా అంతర్గ సీడీసీ నివేదిక ఇప్పుడు గుబులు రేపుతోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెస్ సంచలన ప్రకటన చేశారు. కొత్త కోవిడ్19 మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని.. పాతవి ఇక పనిచేయవని తెలిపారు. ఇక అమెరికాలో వ్యాక్సినేషన్ పెంచేందుకు రాష్ట్రాలు నగదు బహుమతులు ప్రకటించాలని జోబైడెన్ కోరుతున్నారు.

అగ్రరాజ్యంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనాలు బద్దకిస్తున్నారు. అమెరికా కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో తాయిళాలు ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది. మన భారత దేశంలో కరోనా వ్యాక్సిన్లు కోసం భారీ క్యూలు ప్రజలు కడుతుంటే.. అమెరికాలో మాత్రం బోలెడు వ్యాక్సిన్లు ఉన్నా అమెరికన్లు వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అందుకే అమెరికాలో అదిరిపోయే ఆఫర్లను అక్కడి ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు ఇస్తున్నాయి. బంపర్ ఫ్రైజులు ఇస్తున్నాయి. అమెరికాలో టీకా వేసుకుంటే బీర్ పెట్రోల్ సేవింగ్ బాండ్లు ఎయిర్ లైన్స్ టికెట్స్ సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు ఇస్తున్నారు.

అమెరికాలో వ్యాక్సినేషన్ ను వేగంగా చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆ దేశంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది. దీంతో రాష్ట్రాలు కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి.