Begin typing your search above and press return to search.

కంచుకోటల్లో సైకిల్‌కు పంక్చ‌ర్లు.. ఫ్యూచ‌ర్ ఏంటి?!

By:  Tupaki Desk   |   23 Feb 2021 2:30 AM GMT
కంచుకోటల్లో సైకిల్‌కు పంక్చ‌ర్లు.. ఫ్యూచ‌ర్ ఏంటి?!
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కంచుకోట‌ల్లాంటి జిల్లాల్లో కూడా ఇప్పుడు ఆ పార్టీ త‌డ‌బ‌డుతున్న ప‌రిస్థితి స్ప ష్టంగా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉన్న పార్టీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. కాంగ్రెస్ త ర్వాత‌.. ఆ స్థాయి.. టీడీపీకే ఉంది. ఊరూవాడా.. అంతా కూడా అయితే.. కాంగ్రెస్ లేక‌పోతే.. టీడీపీ అన్న ప‌రి స్థితి క‌నిపించింది. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. 2013లో గ్రామీణ స్థాయిలో దూకుడు చూపించిన టీడీపీ ఇప్పుడు.. అదే గ్రామాల్లో చ‌తికిల ప‌డింది. ఎక్క‌డైతే.. అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీని నిల‌బె ట్టారో.. అక్క‌డే ఇప్పుడు ప‌రిస్తితి భిన్నంగా మారింది.

టీడీపీకి బ‌ల‌మైన జిల్లాలుగా ఉన్న విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, విశాఖ‌, ప్ర‌కాశం, నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో.. తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌లు.. తెలుగు దేశం పార్టీ ఉనికిని ప్ర‌శ్నించేలా మారాయి. ఇవేనా .. ఒక‌ప్పుడు టీడీపీని నెత్తిన పెట్టుకున్న గ్రామాలు! అని ఆశ్చ‌ర్య పోయే ప‌రిస్థితిని క‌ల్పించాయి. మ‌రీ ము ఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోను.. ప్రకాశం జిల్లాలోనూ పార్టీ మ‌రింత డీలా ప‌డడాన్ని తేలిక‌గా తీసుకోవా ల్సిన విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆది నుంచి ప్ర‌కాశం జిల్లా టీడీపీకి కంచుకో ట‌. వైఎస్ రంగంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రెస్‌కు బ‌లం చేకూరింది.

అయితే.. అప్ప‌ట్లోనే అలెర్ట్ అయిన‌.. చంద్ర‌బాబు.. 2014 నాటికి ప‌రిస్థితిని టీడీపీకి అనుకూలంగా మార్చు కున్నారు. అందుకే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ.. జ‌గ‌న్ ప్ర‌భావం భారీ ఎత్తున వీచినా.. ఇక్క‌డ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి భిన్నంగా మారింది. కీల‌క‌మైన నాయ‌కుల‌ను చంద్రబాబు చేజార్చుకోవ‌డంతో.. ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం జ‌రిగిన నాలుగో విడ‌త పంచాయ‌తీలో కేవ‌లం 26 స్థానాల‌కే ప‌రిమితం అయింది. దీనిని బ‌ట్టి.. కంచుకోట‌ల్లో సైకిల్‌కు ప‌డుతున్న పంక్ఛ‌ర్లు.. చాలా పెద్ద హెచ్చ‌రిక‌లే పంపుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి.. చంద్ర‌బాబు ఇకనైనా.. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తారో లేదో చూడాలి.