చనిపోయిన 'కుక్క'కి దశ దిన కర్మలు చేసిన రైతు !

Sat Oct 17 2020 19:20:22 GMT+0530 (IST)

The owner who made kharma stalks for a dead dog

అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ! అవును అలాగే ఉంటుంది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకే కర్మకాండలు చేయలేని సమాజంలో మనం ఉన్నాం. కొందరు చనిపోగానే శవాన్ని పడేసి అంతటితో చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఓ రైతు పెంచుకున్న శునకానికి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండలు కూడా నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..  యూపీలోని మీరట్ జిల్లాలోని బాధం గ్రామంలో ఉదంతం చోటుచేసుకుంది. ఒక రైతు తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు ‘పుష్ప’. ఆ కుక్క  మృతి చెందింది. రైతు యోగేష్ తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మృతి చెందడంతో దానికి హిందూ సాంప్రదాయం ప్రకారం బాజా బజంత్రీల మధ్య అంత్యక్రియలు నిర్వహించాడు.ఈ నేపధ్యంలో 13వ రోజున గ్రామస్తులందరికీ భారీ అన్న సంతర్ఫణ కార్యక్రమం నిర్వహించాడు. దీనికి ముందు ఆ రైతు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక కార్డులను ముద్రించి గ్రామస్తులందరికీ పంచాడు. ఆ కుక్కని యోగేష్ ఆరేళ్ల పాటు పెంచుకుంటున్నాడు. అది మృతి చెందినపుడు ఇంటిలోని సభ్యుడే మరణించిన రీతిగా యోగేష్  భాదతో ఏడుస్తూ కంటతడి పెట్టుకున్నాడు. గ్రామస్తులంతా వెంటరాగా యోగేష్ ఆ శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ శునకం మరణించిన తరువాత 13వ రోజున శాంతి హోమాన్ని నిర్వహించాడు. 13 మంది బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలు సమర్పించి ఘనంగా సత్కరించాడు. తరువాత ‘పుష్ఫ’ అస్థికలను పుణ్య నదిలో కలిపాడు. గ్రామస్తులందరికీ అన్నదానం చేసి పుష్పపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఏమైనా మనుషుల కర్మకాండలు నిర్వహించని ఈ రోజుల్లో తన పెంపుడు కుక్క కి దశదినకర్మలు చేయడం అభినందించాల్సిన విషయం.