ఇంట్లో ఈగల మోత ఎక్కువ అవుతోంది రఘురామ.. జర జాగ్రత్త

Mon Jun 14 2021 14:00:01 GMT+0530 (IST)

The number of flies in the house is increasing Raghurama .. Be careful

వీధి సంగతి ఏమో కానీ.. ఎంపీ రఘురామ ఇంట్లో (సొంత నియోజకవర్గంలో) మాత్రం ఈగల మోత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఎన్నికల్లో ఓట్లు వేసిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అనవసరమైన ఈగోలకు పోవటం.. వ్యక్తిగత ప్రతిష్ఠలకు నియోజకవర్గాన్ని తాకట్లు పెట్టేస్తున్న ఎంపీ తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గానికి.. అక్కడి ప్రజలకు అందుబాటులో లేకుండా ఏదేదో చేస్తున్న సంగతి తెలిసిందే.అంతకంతకూ శ్రుతిమించుతోన్న రఘురామ తీరుతో నరసాపురం నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించారు. తమ ఎంపీ రఘురామను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ బహుజన ఐక్య వేదిక అధ్వర్యంలో తాజాగా భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు.

గడిచిన రెండేళ్లుగా నియోజకవర్గాన్ని.. నియోజకవర్గ ప్రజల్ని.. డెవలప్ మెంట్ ను పట్టించుకోని ఎంపీ రఘురామను తక్షణమే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. నమ్మి ఓట్లు వేస్తే తమను మోసం చేశారంటూ నియోజవకర్గానికి చెందిన పలువురు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం గమనార్హం. ఇటీవల కాలంలో రఘురామ దిష్టిబొమ్మల దగ్థాలు సైతం ఎక్కువ అవుతున్నాయి. రోజు రోజుకు తన నియోజవర్గలో పెరుగుతున్న ఈగల మోత గురించి రఘరామ పట్టించుకోకుంటే.. భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందంటున్నారు. వింటున్నారా ఎంపీగారు?