ప్రపంచంలోనే అత్యంత పిసినారి మహిళ

Thu Oct 28 2021 12:42:25 GMT+0530 (IST)

The most selfish woman in the world

డబ్బు ప్రతి ఒక్కరి జీవితం లో కీలకమైనది. అయితే మన సంపాదన బట్టి ఖర్చు కూడా ఉంటుంది. అలాగే డబ్బు సంపాదించడం కూడా అనుకున్నంత ఈజీ అయితే కాదు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.  అలాగే సంపాదించిన డబ్బు ఆదా చేయడం అనేది కూడా అందరివల్ల కాదు. కొందరు డబ్బులు ఎంత ఉన్నాగాని ఊరికే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.మరి కొంతమంది మాత్రం ఉన్నదానిలో కొంచెం ఖర్చు చేసుకుని మరికొంత పొదుపు చేసుకుంటారు. మరి కొంత మంది అయితే మరి ఘోరంగా పిసినారితనంగా ఉంటారు.అయితే ఓ మహిళ డబ్బులు ఎలా ఆదా చేస్తుందో తెలిస్తే  షాక్ అవుతారు. ముక్కున వేలు వేసుకుని అవ్వా అంటారు.వివరాల్లోకి వెళితే న్యూయార్క్లో నివసించే కేట్ హషిమోటోది అనే మహిళ డబ్బులు ఆదా చేయడంలో తన రూటే సెపరేటు. అందుకే ఆవిడ మహా  పిసినారిగా రికార్డు సంపాదించుకుంది. కేట్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు. ఈవిడ డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడదు. గ్యాస్ అయిపోతుందని ఇంట్లో వంట చెయ్యదు. ఒకవేళ బయట ఫ్రెండ్స్ తో భోజనంకు వెళ్లిన ఎట్టి పరిస్థితులలోనూ బిల్ పే చేయదు. దీనితో పాటే అసలు టాయిలెట్ లో వాడే టిష్యూ పేపర్ కూడా వాడడం దండగ అని అనుకుంటుందట. ఇంకో విషయం తెలుసా బట్టలు డిటర్జెంట్ తో వాష్  చేయకుండా షవర్ కిందనే బట్టలు ఉతుక్కుంటదట. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే తాను 1998 లో కొన్నా బట్టలనే ఇన్నీ సంవత్సరాల వేసుకుంటూ నెట్టుకొస్తోంది.

కేట్ మూడు సంవత్సరాల నుంచి అత్యంత ఖరీదైన న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నాను అనిఇక్కడ ఉంటున్న గాని డబ్బులు అసలు ఖర్చు పెట్టను అంటున్నారు.ఎమర్జెన్సీ అని అనిపిస్తే అప్పుడు డబ్బులు బయటకు తీస్తా అంటుంది. అలాగే కేట్ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఆమె డబ్బులు పెట్టి కొన్నవి కాదు. బయట పనికి రానివి అని పారేసిన వస్తువులను చెత్త నుండి తీసుకుని వచ్చి వాటిని ఉపయోగిస్థానని చెప్పుకొచ్చింది.ఇప్పుడు కేట్ పడుకుంటున్న మంచం కూడా అలాంటిదే అంట. ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ తో సహా అన్ని అలా విధుల్లో సేకరించినవే అని అంటుంది. తనకి డబ్బులు ఖర్చుపెట్టడం అంటే మహా చిరాకు అని చెప్పుకొచ్చింది. ఉద్యోగాలు వంటివి లేవా అంటే వృత్తిరిత్యా అకౌంటెంట్.  మంచి జీతం వస్తున్నా దుబారా చేయకుండా 200 డాలర్లతోనే గడిపేస్తుందట.  కేవలం ఇంటి అద్దెకోసం తన తిండి కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తుందట.