Begin typing your search above and press return to search.

అత్యంత ఖరీదైన ఔషధం... రేటు వింటే 'షాక్' కొట్టడం ఖాయం..!

By:  Tupaki Desk   |   25 Nov 2022 7:31 AM GMT
అత్యంత ఖరీదైన ఔషధం... రేటు వింటే షాక్ కొట్టడం ఖాయం..!
X
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం మార్కెట్లోకి వచ్చింది. ఒక అరుదైన వ్యాధికి సంబంధించి ఈ డ్రగ్ ను వాడేందుకు ఇటీవల అమెరికాకు చెందిన ఎఫ్డీఏ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ తాజాగా ప్రపంచ మార్కెట్లోకి ఆ డ్రగ్ ను తీసుకొచ్చింది. ఈ డ్రగ్ రేటెంత?.. ఏ వ్యాధికి వాడుతారనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తి చదవాల్సిందే..!

రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో 'హిమోఫిలియో బీ' అనే వ్యాధి రావడం జరుగుతుంది. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్ 9 (ix) అనే ప్రోటీన్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుందని సైంటిస్టులు గతంలోనే గుర్తించారు. ఈ సమస్యను నివారించడానికి గత కొన్నేళ్లు పరిశోధనలు చేపడుతున్నారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ 'సీఎస్ఎల్ లిమిటెడ్' హిమోఫిలియో బీ అనే అరుదైన వ్యాధికి పరిష్కారాన్ని కనిపెట్టింది.

ఇటీవలే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ 'హిమెఫిలియో బీ' డ్రగ్ కు అనుమతి రావడంతో సీఎస్ఎల్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డ్రగ్ ధరను ప్రస్తుతానికి 3.5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ అక్షరాలు 28.61 కోట్లు. ఇప్పటి వరకు మార్కెట్లో లభ్యమవుతున్న ఔషధాలతో పోలిస్తే దీని విలువ భారీగా ఉంది. దీంతో 'హిమోఫిలియా బీ' డ్రగ్ ప్రపంచంలో అత్యంత ఖరైదీన ఔషధంగా నిలిచింది.

ప్రతీ 40 వేల మందిలో ఒకరు హిమోఫిలియా బీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ అరుదైన వ్యాధికి పలు సంస్థలు ఇప్పటికే పలు రకాలు చికిత్సలను అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సీఎస్ఎల్ తీసుకొచ్చిన ఔషధం దీర్ఘకాలం ప్రభావితంగా పని చేయనుంది. ఈ హిమోఫిలియా డ్రగ్ చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కాలేయంలో ప్రవేశపెడుతుంది.

దీని ద్వారా కాలేయం నుంచి ఫ్యాక్టర్ 9 (ix) విడుదలవుతుందని సీఎస్ఎల్ కంపెనీ పేర్కొంటుంది. ఈ కంపెనీ మార్కెట్లోకి రెండు రకాల ఔషధాలను 'హిమోజెనిక్స్' పేరిట అమెరికా మార్కెట్లో విక్రయాలను చేపడుతోంది. వీటిలో ఒక దాని విలువ 2.8 మిలియన్ డాలర్లు కాగా మరొక దాని విలువ మూడు మిలియన్ డాలర్లుగా ఉంది. త్వరలోనే ఈ ఔషధాలను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్నిరకాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ఎల్ పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.