మాస్కు పెట్టుకోలేదంటే.. అండర్ వేర్ తీసి పెట్టుకుంది

Mon Mar 01 2021 05:00:02 GMT+0530 (IST)

The mask was not put on .. The underwear was taken off

కరోనా పుణ్యమా అని శానిటైజర్.. మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ మధ్యన కేసులు తగ్గిపోవటంతో శానిటైజర్ల వినియోగం తగ్గింది. మాస్కుల మీద అటెన్షన్ సడలింది. కానీ.. షాపుల్లోనూ.. సూపర్ మార్కెట్లతో పాటు.. పలుచోట్ల  ముఖానికి మాస్కులు లేకుండా ఎంట్రీ లేకుండా చేస్తున్నారు. అనుకోని విధంగా మాస్కుల్ని మర్చిపోయిన వారు కొందరు చేస్తున్న చేష్టలు షాకింగ్ మారుతున్నాయి.తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సౌతాఫ్రికాలో చోటు చేసుకుంది. ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లిన మహిళ..తన సామాన్లను తీసుకొని బిల్లింగ్ కౌంటర్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలోఅక్కడే ఉన్న సెక్యురిటీ సిబ్బంది.. ఆమె ముఖానికి ఉండాల్సిన మాస్కు ఏదని ప్రశ్నించారు. దీంతో.. ఆ యువతి క్షణం ఆలోచించి.. తన లాంగ్ ఫ్రాక్ లోపలకు చేతిని పెట్టి.. అండర్ వేర్ ను తీసి.. ముఖానికి తగిలించుకుంది.

అందరి ముందు చేసిన ఈ చర్యకు అక్కడి వారు అవాక్కు అయ్యారు. అయితే.. ఆ మహిళ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని తాను సీరియస్ గా చేసుకుపోయారు. అసలు మాస్కు లేకుండా లోపలకు ఎలా వచ్చారన్నది ప్రశ్నగా మారితే.. మరీ అందరి ముందు ఇలా చేయటం ఏమిటని  మండిపడుతున్నారు. ఇంకొందరు మహిళలు మాత్రం ఆమె సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. కాకుంటే.. ఇలాంటివి ఎక్కువ ప్రచారం జరిగితే.. మాస్కు ముఖానికి లేదని అడగటానికి కూడా బయపడిపోతారేమో?