Begin typing your search above and press return to search.

మహిళా సీఐ ఇంట్లో పురుష సీఐ.. పట్టేసుకున్న సీఐ భర్త.. కేసు నమోదు చేసిన మరో సీఐ

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:46 AM GMT
మహిళా సీఐ ఇంట్లో పురుష సీఐ.. పట్టేసుకున్న సీఐ భర్త.. కేసు నమోదు చేసిన మరో సీఐ
X
నిజంగా ఈ ఉదంతం గురించి మీకు తెలియజేయాలనుకున్న వేళ.. కాసేపు ఆలోచించాల్సి వచ్చింది. దీనికి కారణం ఈ కేసులో సున్నితత్త్వం.. సంక్లిష్టతే. మారుతున్న సమాజం.. కొత్తగా పుట్టుకొస్తున్న కొన్ని పరిణామాల్ని నిశితంగా పరిశీలించేందుకు ఇలాంటి ఉదంతాలు సాయం చేస్తుంటాయి. ఇప్పుడీ ఉదంతంలోని బాధ్యులు.. బాధితులుగా చెప్పే వారే కాదు.. కేసును నమోదు చేసిన వారు కూడా సీఐనే కావటం గమనార్హం. కన్ఫ్యూజ్ కాకుండా అసలు విషయాన్ని సింఫుల్ గా చెప్పేస్తే.

వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ చెందిన ఒక మహిళా సీఐ.. వరంగల్ సీఐడీ ఆఫీసులో పని చేస్తున్నారు.

అక్కడే మరో సీఐ కూడా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో సాదకబాధకాలుతో పాటు.. ఒకే చోట పని చేయటంతో వారి మధ్య చనువు పెరిగింది. ఒకరింటికి మరొకరు వచ్చి పోతుంటారు. అయితే.. మహిళా సీఐ భర్త.. ఇతను కూడా సీఐనే.కాకుంటే ఆయన మహబూబాద్ జిల్లాలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సీఐగా వ్యవహరిస్తుంటారు.

భార్య.. మరో సీఐ మీద అనుమానం ఉన్న అతను.. వారిని పట్టుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మహిళా సీఐ ఇంటికి మరో సీఐ వచ్చారు. వారిద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్న విషయాన్ని గుర్తించి.. తన మిత్రులతో కలిసి వచ్చిన భర్త.. వారిని నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తామిద్దరం ఇంట్లో కూర్చొని ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటున్నట్లుగా చెప్పగా.. భర్త అందుకు అంగీకరించలేదు.

వారిద్దరిని అడ్డుకున్న మహిళా సీఐ భర్త.. అతని మిత్రులు.. స్థానిక సీఐకు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి.. సీఐ ని అదుపులోకి తీసుకున్నారు. మహిళా సీఐ భర్త కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు.

సదరు సీఐ తన ఇంటికి తన అనుమతి లేకుండా వస్తున్నారని.. అడ్డుకున్న తనను చంపుతానని బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తం ఎపిసోడ్ మొత్తం క్రమశిక్షణ ఎక్కువగా ఉంటే.. పోలీసు అధికారుల మధ్య ఇలాంటి ఉదంతాలు బయటకు రావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.