పీటలమీద పెళ్లి ఆపిన అమ్మాయి.. కారణం ఏంటో తెలిస్తే షాకే ..!

Sun Mar 07 2021 17:00:01 GMT+0530 (IST)

The girl who stopped getting married,Shock if you know the reason ..!

మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బంధువులు వచ్చేశారు. పంతులు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. పెళ్లి వేదిక మొత్తం కోలాహలంగా మారింది. పెళ్లి కొడుకు మీద మాంచి జోరుమీద ఉన్నాడు. కాసేపటికే పెళ్లికూతురు కూడా పీటల మీదకు వచ్చేసింది. అక్కడ పెళ్లి కొడుకును చూసేసరికి అతడు నచ్చలేదు. కేవలం వాట్సాప్ ఫొటోలో చూసి పెళ్లికి ఒప్పుకుంది ఆ అమ్మాయి. గతంలో ఫోన్లో మాట్లాడింది కానీ పెళ్లి కొడుకును డైరెక్ట్గా చూడలేదు. అయితే వాట్సాప్ ఫొటోలో బాగున్న పెళ్లికొడుకు .. డైరెక్ట్గా చూసేసరికి నచ్చలేదు. దీంతో ‘నేను ఈ పెళ్లి చేసుకోను’ అంటూ ఖరాకండిగా చేప్పేసింది ఆ అమ్మాయి. అబ్బాయి నాకు నచ్చలేదని అందరిముందే చెప్పేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లా బైరియాలో ఓ ఘటన చోటుచేసుకుంది. అమ్మాయి చేసిన పనికి బంధువులంతా షాక్ అయ్యారు. పెళ్లికూతురుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ససేమిరా అన్నది. ఈ పెళ్లి నేను చేసుకోను అంటూ తేల్చిచెప్పింది. దీంతో చేసేది లేక పెళ్లికొడుకు కూడా నిష్క్రమించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

 అమ్మాయిలు చాలా అప్డేట్ అయ్యారని కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. పాత ఫొటో పంపి మోసం చేయాలనుకున్న పెళ్లికొడుకుకు సరైన బుద్ధి చెప్పిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు చెప్పారని ఎంతో మంది అమ్మాయిలు తలవంచి తాళి కట్టించుకుంటారు. కానీ ఈ అమ్మాయి ధైర్యంగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పిందని కొందరు మెచ్చుకుంటున్నారు.