ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి

Tue May 04 2021 13:00:07 GMT+0530 (IST)

The current Election Commission should be abolished

ఎన్నికల సంఘాలు పాలకులకు అనుకూలంగా పనిచేస్తాయనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. దాన్ని నిజం చేసేలా తాజాగా పరిణామాలు చోటుచేసుకుంది. తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఒకవిడతలో ఎన్నికలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ లో మాత్రం బీజేపీ ప్రచారం కోసం 8 విడతల్లో ఎన్నికలు పెట్టిందనే ఆరోపణలు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసం కోల్పోయిన ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం సభ్యులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.  ఎన్నికల సంఘంలో అధికారుల ఎంపికను సుప్రీంకోర్టు అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరిపేందుకు అవసరమైన అన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు రూపొందించాలని ఆనంద్ శర్మ సూచించారు.

బెంగాల్ లో ఈసీ చర్యలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని.. ఇలాంటి తీరు గర్హనీయమని ఆనంద్ శర్మ తెలిపారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందనేందుకు పలు ఆధారాలు ఉన్నాయ్నారు.

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.