Begin typing your search above and press return to search.

పులుల కోసం ఉక్రెయిన్ ను వదలని తెలుగు వైద్యుడి పరిస్థితి దారుణం..

By:  Tupaki Desk   |   3 Oct 2022 6:41 AM GMT
పులుల కోసం ఉక్రెయిన్ ను వదలని తెలుగు వైద్యుడి పరిస్థితి దారుణం..
X
రష్య, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లెక్కలేనంత మంది సైనికులు, పౌరులు మరణించారు. మరికొంత మంది నిరాశ్రయులయ్యారు. అయితే యుద్ధం ప్రారంభంలోనే ఉక్రెయిన్లోని ఇతర దేశాలకు చెందిన వారు సొంత స్థలాలకు వెళ్లారు. ఈ క్రమంలో భారత్ ప్రత్యేక విమానాలను పంపించి మరీ మన విద్యార్థులను రప్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యుడు గిరికుమార్ మాత్రం తాను రెండు పులులను పెంచుతున్నానని, వాటితో ఇక్కడే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. కానీ రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగియకపోవడంతో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. పులుల సంగతేమో గానీ.. ఆయన నివసించడానికి చోటు దొరకని పరిస్థితి దాపురించింది. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..?

ఏపీకి చెందిన గిరికుమార్ చదువుకోసం ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడే ఓ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ డాక్టర్ గా సేవలందిస్తున్నాడు. 42 ఏళ్లుగా ఆ దేశంలోనే ఉంటూ ఉక్రెయిన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. గిరికుమార్ కు పులులంటే బాగా ఇష్టం. ఇందులో భాగంగా ఆయన చిరుత పులుల జాతికి చెందిన జాగ్వార్లను రెండింటిని పెంచుతున్నాడు. వీటిని ఆయన ఉక్రెయిన్ రాజధానిలోని కీయోవ్ లోని జూలో కొనుక్కున్నాడు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కాగానే చాలా మంది తమ సొంత దేశాలకు వెళ్లారు. భారతీయులను ఇక్కడి ప్రభుత్వం విమానాల ద్వారా రప్పించింది. అయితే గిరికుమార్ కు అవకాశం వచ్చినా ఆయన తన పులులను వదిలి రాలేనని చెప్పాడు.

కానీ కొన్ని రోజుల తరువాత ఆయన దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. యుద్ధం మొదలైన తరువాత పులులకు తిండిపెట్టెందుకు రోజూ 300 డాలర్లు ఖర్చపెట్టిన గిరికుమార్ కు ప్రస్తుతం ఆయనకు తిండి దొరకని పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్లో యుద్ధం ఇంకా ముగిసిపోనందున ఆయన తనదగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. రెండు అపార్ట్మెంట్లు, రెండు కార్లు, ఓ మోటార్ సైకిల్లు మొత్తం లక్ష డాలర్లకు విక్రయించారు. వీటితోనే పులులకు తిండి పెట్టాడు. కానీ ఇవి కూడా అయిపోవడంతో పరిస్థితి తీవ్రమైంది. ఆయన పనిచేస్తున్న ఆసుపత్రి కూడా బాంబు దాడిలో ధ్వంసమైంది.

దీంతో గిరికుమార్ తన పులులకు మూడు నెలలకు సరిపడా ఆహారాన్ని ఉంచి వాటిని ఓ రైతుకు అప్పగించాడు. తన పులులను కాపాడేందుకు ఆ రైతుకు 2400 డాలర్లు చెల్లించాడు. ఆ తరువాత శరణార్థులతో కలిసి పోలండ్ బయలుదేరాడు.

కానీ 12 గంటలు జర్నీ చేసిన తరువాత రష్యా అధికారులను తనను బస్ నుంచి దించివేశారని గిరికుమార్ ఓ వీడియో విడుదల చేసి చెప్పాడు. తన కళ్లకు గంతలు కట్టి భూగర్భంలోని గదికి తీసుకెల్లారని, ఆ తరువాత తనను ఉక్రెయిన్ గూఢాచారినని అనుకున్నారు. కానీ తాను ఎవరి పక్షం లేనని, తాను యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నానని అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని తెలిపాడు.

ఆ తరువాత ఓ అధికారి అక్కడికి వచ్చి తన భార్య ఇతని వీడియోలు చూస్తుందని తెలిపారు. దీంతో గిరికుమార్ పాస్ పోర్టు స్వాధీనం చేసకొని పోలండ్ లో వదిలిపెట్టారు. ఇక్కడా ఆయనకు ఓ అగ్రిమెంట్ వీసా మాత్రమే అందించారు. అంటే 90 రోజుల పాటు పోలండ్ లో నివసించొచ్చు. ప్రస్తుతం ఆయన ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు. తన వద్ద అరుదైన జాతి పులులు ఉన్నాయని, వీటిని భారత అధికారులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని అన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.