రోడ్డెక్కిన ఎడ్లబండికి రూ.1000 జరిమానా

Tue Sep 17 2019 10:03:51 GMT+0530 (IST)

The challan of Rs 1,000 was issued to bullock cart owner Riaz Hassan

కేంద్రం అమలు చేస్తున్న నూతన మోటార్ వాహనాల చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే లారీలు - ఆటోవాలాలు - బైకర్లకు వేలు - లక్షల ఫైన్లు పడి లబోదిబోమంటున్నారు. కొందరు ఫైన్లు భరించలేక వాహనాలను వదిలి వెళుతున్న ఘటనలు చోటుచేసుకున్నాయి.తాజాగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారంటూ ఓ ఎడ్లబండికి జరిమానా విధించడం కలకలం రేపింది.. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు ఓ రైతుకు చెందిన ఎడ్లబండిపై జరిమానా విధించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా డెహ్రాడూన్ లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్ సైకిళ్లను తగుల బెట్టారు..

చార్బా గ్రామానికి చెందిన రియాజ్ హసన్ తన ఎడ్లబండిలో పంటను ఇంటికి రోడ్డు గుండా తీసుకెళుతుండగా పోలీసులు ఆపి రోడ్డుపై నిబంధనలు పాటించలేదని రూ.1000 చలానా వేశారు. దీనిపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. చలాన్లపై ఇతర రైతులంతా రోడ్డెక్కడంతో పోలీసులు తప్పు దిద్దుకున్నారు.

వాహనచట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకొని చలాన్ రద్దు చేశారు. అయినప్పటికీ పోలీసుల తీరుపై రైతు రోడ్డెక్కి నిరసనలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.