Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు కేంద్ర అదిరిపోయే శుభవార్త

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:00 PM GMT
ఉద్యోగులకు కేంద్ర అదిరిపోయే శుభవార్త
X
కరోనా వైరస్ తో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అందరి ఉద్యోగాలు పోయాయి. చాలా మంది రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టింది.

కేంద్రం ఉద్యోగులకు రెండు కీలక పథకాలు ప్రవేశపెట్టింది . లీవ్ ట్రావెల్ కన్సీషన్ (ఎల్ టీసీ) క్యాష్ ఓచర్ స్కీమ్ ఒకటి. స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీమ్ మరొకటి. ఈ రెండు స్కీమ్స్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ప్రయోజనం కలుగనుంది.

దేశంలో డిమాండ్ పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఈ రెండు స్కీమ్స్ ను తీసుకువస్తున్నారు. వీటి ద్వారా ప్రజల ఖర్చును పెంచాలని భావిస్తున్నారు.

ఎల్ టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్ తో ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ డబ్బులతో పాటు ఇంకా టికెట్ ధరకు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు. ఉద్యోగులు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ డబ్బులతోపాటు ఇంకా టికెట్ ధరకు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చు. ఈ డబ్బులతో ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. కాగా ఉద్యోగులు నాలుగేళ్లలో ఒకసారి ఎల్.టీ.సీ పొందొచ్చు.

ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్రాలకు, ప్రైవేట్ సంస్థలకు కూడా ఎల్.టీసీ స్కీమ్ వర్తిస్తుంది. వీటి ఉద్యోగులకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులు రూ.10వేలు ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే అడ్వాన్స్ కింద పొందొచ్చు. ప్రీపెయిడ్ రూపే కార్డు రూపంలో ఈ డబ్బులు వస్తాయి. 2021 మార్చి 31 లోపు ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి. రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలపరిమితితో రూ.12000కోట్ల మొత్తాన్ని వడ్డీ రహిత రుణాల కింద అందించేందుకు రెడీగా ఉన్నామని నిర్మల తెలిపారు.