పత్ని బిగి కౌగిలితో ఆ ఉత్సాహమే వేరప్పా

Thu May 06 2021 16:00:01 GMT+0530 (IST)

The benefits to hugging

ఈరోజుల్లో ఒక్కరు పనిచేస్తే బండి నడిచే రోజులు కావు. భార్యభర్తలు ఇద్దరూ పనిచేయాల్సిందే.. కపుల్స్ రోజంతా ఉద్యోగాలతో కుస్తీ పడాల్సిందే. అలా చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అయితే ఎంత పని ఒత్తిడి ఉన్నా రాత్రి అయ్యేసరికి ఆలుమగలు కలిసి పడుకోవాల్సిందే. కానీ అలసితి.. సొలిసితి అంటూ చెరోదిక్కున పడుకుంటే ఏం మజా ఉంటుంది. అందుకే ఆలుమగలు ఖచ్చితంగా ఇది రాత్రి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.జంటలు రోజంతా ఉద్యోగాలతో బిజీ ఇక రాత్రి అయ్యే సరికి అలసటతో చెరోవైపు తిరిగి పడుకుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందుకే రాత్రయ్యాక ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

సరదాగా ముద్దూ ముచ్చట్లు ఆడుకోవడం.. రోమాంటిక్ మూవీ చూడటం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇద్దరూ కాసేపు ఇలా సరదాగా గడిపితే చాలు అని అంటున్నారు.

ఇలా రాత్రంతా భాగస్వామి కౌగిలిలో ఉటే మర్నాడు ఉత్సాహంగా నిద్ర లేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనుబంధం కూడా స్ట్రాంగ్ అవుతుందని చెబుతున్నారు.