కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం ...హెలిక్యాప్టర్ రెక్కలు విరిగిపోయాయి

Sat Oct 17 2020 23:06:04 GMT+0530 (IST)

The Union Minister narrowly missed the danger

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేకుంటే ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లేది.తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రవిశంకర్ పాల్గొంటున్నారు. ఆ రాష్ట్రంలోని వివిధ సభల్లో బీహార్ మంత్రులు మంగళ్ పాండే సంజయ్ ఝాలతో కలిసి హెలిక్యాప్టర్ లో పర్యటిస్తూ మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ బీహార్ రాజధాని పాట్నా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. కరెంట్ తీగలకు తగలడం వల్ల హెలిక్యాప్టర్ రెక్కలు విరిగిపోయాయి.

అయితే ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ క్షేమంగా బయటపడ్డారు. ఆయనతోపాటు హెలిక్యాప్టర్ లో మంత్రులు మంగళ్ పాండే సంజయ్ ఝాలు కూడా ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా పైలెట్ సమయస్ఫూర్తిగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.