Begin typing your search above and press return to search.

తన లైఫ్ లో జరిగిన సీక్రెట్ ను బయటపెట్టిన తెలంగాణ మంత్రి

By:  Tupaki Desk   |   23 May 2022 12:30 PM GMT
తన లైఫ్ లో జరిగిన సీక్రెట్ ను బయటపెట్టిన తెలంగాణ మంత్రి
X
మనిషి అన్నాక ఎన్నోకొన్నిరహస్యాలు లేకుండా ఉండవు. సెలబ్రిటీలు తమ జీవితాల్లో జరిగిన సిత్ర విచిత్రమైన సీక్రెట్లను.. ఇటీవల కాలంలో రియాల్టీ షోలలో బయటపెడుతూ వార్తల్లోకి రావటమే కాదు.. సరికొత్తగా బయటపెట్టిన సీక్రెట్ తో సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలకు ఉన్నంత స్వేచ్ఛ రాజకీయ నేతలకు ఉండదు. ఆ మాటకు వస్తే.. వారి జీవితాల్లోని రహస్యాల్ని బయటపెడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే.. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు రాజకీయ నేతలు.


అయితే.. ఇందుకు భిన్నంగా కొందరు నేతలు మాత్రం తమ జీవితాల్లోని సీక్రెట్లను సందర్భానికి తగినట్లుగా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. తాజాగా అలాంటి సీక్రెట్ ను రివీల్ చేసి అందరిని విస్మయానికి గురి చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో చేరిన ఆమె.. ఎట్టకేలకు మంత్రి పదవిని చేపట్టటం ద్వారా.. తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చారు. దివంగత మహానేత వైఎస్ ప్రభుత్వంలో చేవెళ్ల చెల్లెమ్మగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న సబితకు ఆ తర్వాత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.


ఒకదశలో ఆమె రాజకీయ భవిష్యత్తు సందేహాల్లో పడింది. ఇలాంటివేళ.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విద్యా శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. తన జీవితంలో జరిగిన రహస్యాన్ని బయటపెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.

సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు డాక్టర్ కావాలని చాలా కోరిక ఉండేది. ఎంసెట్ రాస్తానంటే మా ఇంట్లో వద్దన్నారు (ఇప్పుడైతే నీట్ అంటూ జాతీయ స్థాయిలో ఒకటే పరీక్షను నిర్వహిస్తున్నారు. గతంలో మాత్రం ఎంసెట్ ను రాష్ట్రాల వారీగా ఇంజనీరింగ్.. వైద్య విద్యను అభ్యసించటానికి వేర్వేరుగా పరీక్షనిర్వహించటం తెలిసిందే) అంత ఖరీదైన చదువులు చదివించలేమన్నారు. అయినా ఇంట్లో వారికి చెప్పకుండా స్నేహితులతో కలిసి వెళ్లి ఎంసెట్ రాసి వచ్చా.

అమ్మాయిలకు ఉత్తరం చదవటం.. పేరు రాయటం వస్తే చాలు అనేవారు. ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత నాకు ఒక్కసారిగా నా చిన్ననాటి గురుతులు గుర్తుకు వచ్చాయి’’ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని సందర్భానికి తగినట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. నిజమే.. గతంలో పోలిస్తే ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల విజన్ పూర్తిగా మారిందనే చెప్పాలి.