శృంగారానికి దూరమైతే చాలా ప్రమాదమట.!

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

The Surprising Health Benefits From Sex

ఉరుకుల పరుగుల జీవితం.. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలు దేరితే ఆఫీసులో పనిచేసి అలిసి సొలిసి రాత్రి 10 ఇంటికి ఇంటికి వస్తారు. ఇక ఆధునిక ఐటీ - ఎలక్ట్రానిక్ - ఇతర నైట్ డ్యూటీ ఉండే ఉద్యోగాల వల్ల నగరాల్లోని యువత సెక్స్ కు దూరమైపోతున్నారు. ఏ వారానికో - నెలకు ఒక్కసారో ఆ రుచి చూస్తున్నారు. అదీ మొక్కుబడిగానే.. ఇక సెల్ ఫోన్ - టీవీ దెబ్బకు ఆలుమగల మధ్య అసలు సెక్స్ అనేదే లేకుండా పోతోంది. దీంతో శృంగారాన్ని పూర్వంలా జంటలు ఎంజాయ్ చేయలేకపోతున్నారన్నది నిర్విదాంశం.సెక్సువల్ లైఫ్ కు చాలా రోజులు దూరంగా ఉంటే డేంజర్ అంటున్నారు నిపుణులు. ఆ ప్రభావం స్త్రీల కంటే పురుషులకే ఎక్కువ నష్టం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

శృంగారానికి దూరంగా ఉంటే రక్తప్రసరణ అనేది శరీరంలో సరిగ్గా జరగక రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. శృంగారం చేయని వారిలో ఒత్తిడి పెరిగిపోయి అనేక ఇతర రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు..

దీర్ఘాకాలం సెక్స్ కు దూరంగా ఉండే పురుషులకు వీటన్నింటితోపాటు అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సెక్స్ కు దూరంగా ఉంటే ఒత్తిడి - రక్తప్రసరణ-రోగనిరోధక శక్తి తగ్గడం..  అంగస్తంభన సమస్యలు చుట్టుముడుతాయని తాజాగా డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది.