Begin typing your search above and press return to search.

ప్రతి ఆదివారం జనతా కర్ఫ్యూ ... ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   20 May 2020 9:10 AM GMT
ప్రతి ఆదివారం జనతా కర్ఫ్యూ ... ఎందుకంటే ?
X
ఈ మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో పలు సూచనలతో అనేక రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కర్ణాటక లో ఆర్టీసీ బస్సులు తిప్పడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం అనేక కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మళ్లీ ప్రభుత్వం చెప్పే వరకు ప్రతి ఆదివారం జనతా కర్ప్యూ అమలులో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐటీ, బీటీ దేశ రాజధాని బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం ప్రతి ఆదివారం కర్ఫ్యూ అమలులో ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.

లాక్ డౌన్ తో గత రెండు నెలల నుంచి ఇళ్లకే పరిమితం అయిన చాలా మంది ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీల ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు తదితర పనులు చేసుకునే వారు దాదాపుగా విసిగిపోయారు. ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీల ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు చేసే వారు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వారివారి కార్యకలాపాలు సాగించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల పాటు ఎవరి పనులు వారు చేసుకోవడానికి తాము అనుమతి ఇస్తున్నామని, అయితే ప్రతి ఆదివారం మాత్రం ప్రజలు అందరూ వారివారి ఇళ్లకే పరిమితం కావాలని, ఆ రోజు జనతా కర్ఫ్యూ అమలు చేస్తామని కర్ణాటక సీఎం తెలిపారు.

ప్రతి ఆదివారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని, అనవసరంగా రాకూడదు అని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అత్యవసర వస్తువులు మినహాయించి అన్ని వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. అలాగే, ఆదివారం వైన్ షాప్ లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం అందరికి సెలవు కావడంతో ఆ రోజు ప్రజలు గుంపులు గుంపులుగా ఒక్కచోట చేరడం, రోడ్ల మీద మీటింగ్ లు పెట్టడం చేస్తుంటారని ప్రభుత్వం చెప్తుంది. అంతే కాకుండా ఆదివారం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకు సంచరించే వాళ్లు ఎక్కువగా ఉంటారని , మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల కోసం మార్కెట్ ల దగ్గర ఒక్కచోట గుమికూడే అవకాశం ఉంటుందని అందుకే ఆరోజు జనతా కర్ఫ్యూ విధించామని ప్రభుత్వం తెలిపింది.