ఫాఫం.. వరుడు జడుసుకున్నాడుః పెళ్లిలో మరదలు ఏం చేసిందంటే?

Sun Jun 13 2021 08:00:01 GMT+0530 (IST)

The Groom was Scared In Marriage

జీవితంలో ప్రతి పండుగా మళ్లీ మళ్లీ వస్తుంది. పెళ్లి మాత్రం ఒకేసారి. అందుకే.. ఎవరికి వారు చేతనైనంత ఘనంగా పెళ్లి పండుగ జరుపుకుంటారు. ఎన్నో ఆనందాల నడుమ ఈ వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా చూసుకుంటారు. అయితే.. పెళ్లి సంబరాల్లో సంతోషకరమైన ఘట్టాల్లో ఒకటి పెళ్లి కొడుకును ఆటపట్టించడం. బావలు మరదళ్లు పలు రకాలుగా వరుడిని ఆడుకుంటారు. కానీ.. ఇతగాడి మరదలు మాత్రం ముద్దులతో బెదరగొట్టింది.ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా.. వధూవరులతో ఫొటో సెషన్ నడుస్తోంది. పెళ్లి కూతురు సోదరి కూడా ఫొటో దిగడానికి వచ్చింది. రెడీ.. వన్.. టూ.. త్రీ అన్నంత సేపు కెమెరా వైపు చూసింది. అక్కడ క్లిక్ మనిపించగానే వెంటనే తన పని మొదలు పెట్టింది. వరుడిని గట్టిగా పట్టుకొని బుగ్గ కొరకడం స్టార్ట్ చేసింది.

ఈ దెబ్బకు బెడిరిపోయిన వరుడు కిందకు వంగి మరీ విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ.. మరదలు అవకాశమే ఇవ్వలేదు. ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చింది కాబట్టి.. బావను ఒడిసిపట్టింది. గట్టిగా రెండు చేతుల్లో బంధించి ముద్దుల్లో ముంచెత్తింది. ఇది చూసిన అక్కడున్నవారంతా గొళ్లున నవ్వేశారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయమై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం షేర్ల మీద షేర్లు అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. అరెరే.. పెళ్లి కొడుకు జడుసుకున్నాడని జోకులు పేలుస్తున్నారు.