Begin typing your search above and press return to search.

సిమెంట్, ఇనుము ధరలు తగ్గించండి.. కేంద్రం సీరియస్

By:  Tupaki Desk   |   24 Jan 2021 11:00 AM GMT
సిమెంట్, ఇనుము ధరలు తగ్గించండి.. కేంద్రం సీరియస్
X
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సిమెంట్, ఇనుము ధరల వల్ల సామాన్యుడి సొంతింటి కల పెనుభారమవుతోంది. ప్రాజెక్టులపై వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో రోడ్లు, మౌళిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వానికి పెను భారమవుతోంది. ఈ క్రమంలోనే దేశంలో సిమెంట్, ఇనుము కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుతున్నారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడర్కీ సీరియస్ అయ్యారు.

ఈ క్రమంలోనే సిమెంట్, ఇనుము ధరలు తగ్గించాలని ఉత్పత్తిదారులను, వ్యాపారులను కోరారు. దేశంలో వినియోగిస్తున్న స్టీల్, సిమెంట్ లో 40శాతం దేశవ్యాప్తంగా రహదారుల కోసమే వినియోగిస్తున్నామని వివరించారు. అందుకే ఈ సిమెంట్, ఇనుము ధరలు తగ్గించాలని కోరారు. లేని పక్షంలో ప్రత్యామ్మాయ మార్గాలను అన్వేషిస్తామని మంత్రి ఉత్పత్తిదారులు, వ్యాపారులను హెచ్చరించారు.

దేశీయంగా ఉత్పత్తి అధికంగా ఉందని.. సేవలు తక్కువ ధరలకే లభిస్తున్నాయని అయినా కూడా వ్యాపారులు సిమెంట్, ఇనుమును బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని మంత్రి గడ్కరీ ఆరోపించారు.

కృత్రిమ ధరల పెరుగుదల న్యాయం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉత్పత్తిదారులు దారికి రాకపోతే ప్రత్యామ్మాయంగా సింథటిక్ ఫైబర్, కాంపోసిట్ ఫైబర్ వినియోగిస్తామని హెచ్చరించారు.