Begin typing your search above and press return to search.

ఈఎంఐల కట్టిన వారికి త్వరలో శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్ !

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:00 PM GMT
ఈఎంఐల  కట్టిన వారికి త్వరలో శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్  !
X
కరోనా విజృంభణ నేపథ్యంలో, కేంద్రం లాక్ ‌డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఆ లాక్ డౌన్ సమయంలో కేంద్రమిచ్చిన మారటోరియంను వినియోగించు కోకుండా నెలవారీ ఈఎంఐలు సకాలంలో చెల్లించిన వారికి మోదీ ప్రభుత్వం అతి త్వరలో శుభవార్త చెప్పబోతోంది. రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. కరోనా లౌక్‌ డౌన్‌ కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లోన్లన్నటిపైనా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. దసరా-దీపావళి మధ్య కాలంలో ఈ శుభవార్తపై కేంద్ర ఆర్థిక మంత్రి గానీ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులుగానీ ఓ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మార్చి 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు ఇది అమల్లో ఉండగా చాలామంది తమ ఈఎంఐలను సమయానికి చెల్లించలేదు. మరికొందరు ఎప్పటిలాగానే చెల్లింపులు చేశారు. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్‌, హోమ్‌ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని ఆరు నెలల కాలానికి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. డబ్బులు కరెక్ట్ గా అందకపోయినా కూడా వారు ఈ మారటోరియం నుంచి వినియోగించుకోకుండా రెగ్యులర్‌గా కిస్తులను చెల్లించారు. మరికొంతరు మారటోరియంను వినియోగించుకున్నారు. అత్యంత కష్ట కాలంలోను కిస్తులను క్రమంగా చెల్లించిన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వుంది. అందుకే రెగ్యులర్‌గా కిస్తులను చెల్లించిన వారికి కొంతైనా వడ్డీ మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన దసరా-దీపావళి మధ్య కాలంలో వెలువడే అవకాశం వుంది.