Begin typing your search above and press return to search.

పుట్టి మునుగుతుంది.. ఇచ్చేద్దాం స‌ర్‌.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఆ మంత్రి విన్న‌పాలు!

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:12 AM GMT
పుట్టి మునుగుతుంది.. ఇచ్చేద్దాం  స‌ర్‌.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఆ మంత్రి విన్న‌పాలు!
X
ప్ర‌స్తుతం ఏపీలో ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం త‌మ‌ను అన్యాయం చేసింద‌ని.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీపీఎస్ పింఛ‌న్ విధానాన్ని ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చి ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని ప‌ట్టించుకోలేద‌ని.. ఉద్యోగులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వం మాత్రం.. తాము చేయాల‌ని అనుకున్నా చేయ‌లేక‌పోతున్నామ‌ని.. చెప్పేసింది.

దీంతో ప్ర‌భుత్వానికి-ఉద్యోగుల‌కు మ‌ధ్య వార్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందా.. ఎప్ప‌డెప్పుడు.. త‌మ త‌ఢాకా చూపిద్దామా? అని ఉద్యోగులు రెడీగా ఉన్నారు. ఇంత‌లోనే.. అస‌లు వారు చేసిన ప‌నికి ఇవ్వాల్సిన వేత‌నాల విష‌యంలోనూ జీతాలు ఇవ్వ‌లేక ప్ర‌భుత్వం స‌త‌మ‌తం అవుతోంది. నెల‌లో 5వ తారీకులోపు 20 శాతం.. 10 లోపు 30 శాతం అంటూ.. వాయిదాల ప‌ద్ధ‌తిలో ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయితే, ఇప్ప‌టికే సీపీఎస్ విష‌యంలో ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఉద్యోగుల‌కు ఇలా చేయొద్ద‌ని.. ఒక కీల‌క మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత ఒక‌రు. సీఎం ద‌గ్గ‌ర విన్న‌వించారు. "స‌ర్‌.. ఇప్ప‌టికే వాళ్లు మ‌న‌పై పీక‌ల దాకా కోపంతో ఉన్నారు. సీపీఎస్ ఎలానూ కాదు. దీనిని ప‌క్క‌న పెట్టండి. క‌నీసం నెల‌లో 1 లేదా 2 తేదీల్లో జీతాలు ఇచ్చేస్తే.. కొంత శాంతిస్తారు" అని ఉచిత స‌ల‌హా ఇచ్చార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

అది కూడా ఉద్యోగుల‌తో స‌మావేశాల‌కు ముందు జ‌రిగిన ప‌రిణామ‌మ‌ని అంటున్నారు. అయితే.. త‌న ప్రియార్టీ ప్ర‌జ‌లేన‌ని.. వారికి ఇవ్వాల్సిన పింఛ‌న్లు.. ఇత‌ర‌త్రా సామాజిక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అయిన త‌ర్వాతే.. చూద్దామ‌ని సీఎం తెగేసి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో స‌ద‌రు మంత్రి "ఇలాగైతే.. పుట్టి మునుగుతుంది" అని కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో.. సీఎం కూడా అంతే సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది.

మొత్తానికి ఉద్యోగులు వ‌ర్సెస్ ప్ర‌భుత్వ ర‌గ‌డ‌లో తాము న‌లుగుతున్నామ‌నే ఆవేద‌న వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా వ్య‌క్తం చేస్తున్నా.. తాజాగా ఇది మంత్రి వ‌రకు, ముఖ్య‌మంత్రి వ‌ర‌కు చేర‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.