Begin typing your search above and press return to search.

చెప్పులు కొట్టేస్తాడు.. వాటి‌తో శృంగారం చేసేస్తాడు..

By:  Tupaki Desk   |   2 Jun 2020 11:30 PM GMT
చెప్పులు కొట్టేస్తాడు.. వాటి‌తో శృంగారం చేసేస్తాడు..
X
చెప్పులు దొంగ‌త‌నం చేస్తాడు.. వాటిని ధ‌రించి వేరే చోట విక్ర‌యిస్తాడ‌నుకుంటే పొర‌పాటు. వాటిని ధ‌రించి త‌న్మ‌య‌త్వానికి గుర‌వుతాడు.. ఆ త‌ర్వాత బ‌ట్ట‌ల‌న్నీ విప్పేసి వాటితో శృంగారం చేస్తాడు.. ఆపండి. ఏంటి వార్త అనుకుంటున్నారా..! ఇది నిజం. అలాంటి థాయ్‌లాండ్‌లో ఉన్నాడు. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ‌డంతో ఈ విష‌యం తెలిసింది.

థాయ్‌లాండ్‌లోని నొంతబూరి ప్రాంతానికి చెందిన తీరాపత్ క్లైయా (24) చెప్పుల దొంగ‌. చెప్పులు దొంగ‌త‌నం అలవాటుగా మారింది. అతడు నివసిస్తున్న వీధిలో ఏ ఇంటి ముందు చెప్పులు కనిపించినా వెంటనే మాయం చేస్తాడు. సుమారు రెండేళ్ల నుంచి చెప్పులు దొంగ‌త‌నం చేస్తున్నాడు. అయితే త‌మ ప్రాంతంలో త‌ర‌చూ చెప్పులు దొంగ‌త‌నానికి గుర‌వుతుండ‌‌డంతో స్థానికులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చెప్పులు పోయాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేం క‌దా అని ఊరుకున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ పోతుండడంతో చివ‌ర‌కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు మొదలుపెట్టారు. విచార‌ణ‌లో భాగంగా సీసీ టీవీ కెమెరాలు ప‌రిశీలించ‌గా ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ ప్రాంతంలో క్లైయా చెప్పులు దొంగ‌త‌నం చేస్తున్న‌ట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని క్లెయా ఇంట్లో ప‌రిశీలించారు.

అత‌డి ఇంట్లో 126 జతల చెప్పులు కనిపించాయి. కొత్త చెప్పుల మాదిరి ఉన్నాయి. వీటిని ఎందుకు దొంగ‌త‌నం చేస్తున్నావు? వేరే చోట వీటిని అమ్ముతున్నావా అని పోలీసులు అడిగారు. ఈ స‌మ‌యంలో క్లైయా చెప్పుల దొంగ‌త‌నానికి చెప్పిన కారణం విని వాళ్లు ఆశ్చర్యపోయారు. చెప్పులతో తాను సెక్స్ చేస్తాన‌ని, వాటితో త‌న‌కు కోరికలు పెంచుతాయని క్లెయా తెలిపాడు. చెప్పుల‌ను రోజంతా వేసుకుంటే త‌నలో కోరికలు పెరుగుతాయని వివ‌రించాడు. చెప్పులు వేసుకున్న అనంత‌రం త‌న దుస్తులన్నీ విప్పేసి ఆ చెప్పులతో తన శరీరాన్ని రుద్దుకుంటానని, ఆ తర్వాత వాటితో సెక్స్ చేస్తానని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఇది విన్న పోలీసులు ఏం చేయాలో అర్థం కాలేదు. అనంత‌రం పోలీసులు కొట్టేసిన చెప్పులను స్టేషన్‌ బయట ఉంచారు. అయితే క్లెయా చెప్పిన కార‌ణం తెలుసుకున్న చెప్పులు పోయిన వారు వాటిని తీసుకోవ‌డానికి రాలేదు. వాటితో సెక్స్ చేస్తాన‌ని చెప్ప‌డంతో వాటిని వదిలేశారు.