Begin typing your search above and press return to search.

అరరే .. చేతి రేఖల్ని కూడా మార్చేస్తున్నారట !

By:  Tupaki Desk   |   18 Oct 2020 1:30 AM GMT
అరరే .. చేతి రేఖల్ని కూడా మార్చేస్తున్నారట !
X
మనిషి పైన గ్రహాల ప్రభావం ఉండి తీరుతుందని , నమ్మినా, నమ్మకపోయినా పుట్టిన సమయంలో గ్రహాల స్థితిగతుల్ని బట్టి మనిషి జీవితం నడుస్తుందని, గ్రహాల బలాలు మారుతూ ఉంటాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మరు. మనిషిలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. గ్రహాలలో శుభ గ్రహాలు, పాప గ్రహాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఇక , శుభ ఫలితాలను అంచనా వేయడమే జ్యోతిషం చేసేపని. అరచేతి గీతలు గుర్తులు, గ్రహబలాలకు. ప్రతిబింబాలు పుట్టినప్పుడే విధి నుదుటిపైన కనిపించని రాతలు, అరచేతుల్లో కనిపించే గీతలు రాస్తుందని కొందరి నమ్మకం. హస్తరేఖలను బట్టి జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రాన్ని హస్తసాముద్రికం అని పిలుస్తారు.

మనదేశంతోపాటు అనేక దేశాల్లో ఈ హస్త సాముద్రికాన్ని నమ్ముతారు. మన జీవితం మన చేతిరేఖలపై ఆధారపడి ఉందని చాలా మంది నమ్ముతారు. అరచేతిలో ఉండే ఒక్కో రేఖ.. ఆరోగ్యం, ఆయుష్షు, వివాహం, సంతానం, అదృష్టం, ఆర్థికం ఇలా ఒక్కో అంశాన్ని సూచిస్తాయనేది ఓ నమ్మకం. ఇక , థాయ్ ‌లాండ్‌ వాసులు ఈ హస్తసాముద్రికాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఆ నమ్మకాన్నే ఓ కంపెనీ ఇప్పుడు క్యాష్ రూపంలోకి మార్చుకునే పనిలో నిమగ్నమైంది. మీకు అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తామంటూ అమాయక ప్రజలను ఆకర్షిస్తోంది.

థాయ్‌ లాండ్ ‌కి చెందిన ప్రొఫెసర్‌ ప్లీ అనే వ్యక్తి గతంలో టాటూలు వేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల నొంతాబురి ప్రాంతంలో మహాహెంగ్ ‌999 పేరుతో ఓ కంపెనీ ప్రారంభించి, ప్రజలు మెరుగైన జీవితం పొందడం కోసం వారి చేతిలోని రేఖలను కావాల్సినట్టుగా మారుస్తామని ప్రకటించారు. దీంతో దివ్యమైన భవిష్యత్తుకోసం ప్రజలు ఆ కంపెనీ ముందు బారులు తీరారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ముందుగా హస్తసాముద్రికం తెలిసిన నిపుణులు హస్తరేఖల్ని చూసి ఏవి బలహీనంగా ఉన్నాయో.. ఏయే రేఖల్ని మార్చుకోవాలో చెప్తారట. వారు సూచించిన మేరకు కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తరేఖల్ని మార్చడం, కొత్తవి గీయడం వంటివి చేస్తున్నారు. ఈ బిజినెస్ బాగా జరుగుతుండటంతో త్వరలోనే మరో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనీ ప్రొఫెసర్‌ ప్లీ ప్లాన్ చేస్తున్నాడట.