డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయారు.. తర్వాత ఏమైంది?

Wed Sep 11 2019 13:02:51 GMT+0530 (IST)

Tesla driver asleep at the wheel on freeway

కారు అత్యాధునిక టెక్నాలజీతో చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలు ఇప్పటికే గాలిలో కలిసిపోయి ఉండేది. వారి ఫొటోలకు దండేసేవారు.. అత్యాధునిక టెక్నాలజీ గల టెస్ లా కారు ఇద్దరిని కాపాడింది. ఆ కారులో ఆటోపైలెట్ ఫంక్షన్ అనే టెక్నాలజీ ఉంది. హైవేలో ప్రయాణించినప్పుడు మన స్టీరింగ్ పట్టుకోకపోయినా ఆటోపైలెట్ అనే టెక్నాలజీతో రోడ్డుపై కారు కొద్దిదూరం వరకు సొంతంగా వెళుతుంది. ప్రమాదాలు చేయదు.  ఇప్పుడు ఈ టెక్నాలజీనే ఇద్దరి ప్రాణాలు కాపాడింది.అమెరికాలోని బోస్టన్ అదీ.. మాసాచుసెట్స్ లోని న్యూటన్ హైవే. ఓ కారు 60కి.మీల వేగంతో వెళుతోంది.. కానీ కారు నడుపుతున్న వ్యక్తి పక్కనే ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకున్నారు. ఇది గమనించిన పక్కనే మరో కారులో వెళుతున్న డకోటా రాండల్ అనే వ్యక్తి కారులో నిద్రపోయిన ఇద్దరినీ చూసి గట్టిగా హారన్ కొట్టాడు. అయినా వాళ్లు లేవలేదు. ఎంత ప్రయత్నించినా వారు లేవకపోవడం.. కారు మాత్రం అలాగే నడుస్తుండడం చూసి షాక్ తిన్నాడు. వెంటనే వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోయిన వారి వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. టెస్ లా కారులో ఆటోపైలెట్ టెక్నాలజీ వల్లే వారిద్దరూ బతికిపోయారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో టెస్ లా కారు ప్రమాదానికి గురికాకపోవడంపై ఆ కంపెనీ స్పందించింది. టెస్ లాలోని ఆటోపైలెట్ టెక్నాలజీ వల్ల హైవేలో డ్రైవర్ చేతులు స్టీరింగ్ పై పెట్టకపోయినా కొద్దిదూరంగా సొంతంగా ప్రయాణిస్తుందని.. కానీ అలా డ్రైవింగ్ చేయడం ప్రమాదమని తెలిపారు. ప్రతీ 30 సెకన్లకు స్టీరింగ్ పట్టుకోకపోతే కారులో అలారం మోగుతుంటుందని కంపెనీ తెలిపింది.