Begin typing your search above and press return to search.

ఆ అందాల టెన్నిస్ ప్లేయ‌ర్ ఆస్తి ల‌క్ష కోట్లా!

By:  Tupaki Desk   |   28 Feb 2020 5:30 PM GMT
ఆ అందాల టెన్నిస్ ప్లేయ‌ర్ ఆస్తి ల‌క్ష కోట్లా!
X
అంత‌ర్జాతీయ టెన్నిస్ నుంచి ర‌ష్య‌న్ సంచ‌ల‌నం ష‌ర‌పోవా త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు ప‌లికింది ష‌ర‌పోవా. ఆట‌తో పాటు అందంతో టెన్నిస్ పై చెర‌గ‌ని ముద్ర వేసింది ఈ ర‌ష్య‌న్ భామ‌. టెన్నిస్ లో చాలా మంది అమ్మాయిలు వ‌య‌సు మీద ప‌డుతున్నా కొన‌సాగుతూ ఉంటారు. సింగిల్స్ లో ఫామ్ కోల్పోయిన త‌ర్వాత డ‌బుల్స్ మీద దృష్టి పెట్టి ఏదోలా కెరీర్ కొన‌సాగిస్తూ ఉంటారు. అయితే ష‌ర‌పోవా మాత్రం రిటైర్ మెంట్ ప్ర‌క‌టించింది.

దానికి కొన్ని ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి. ఫామ్ కోల్పోవ‌డం ఒక రీజ‌న్ అయితే, కొన్నేళ్ల కింద‌ట ఈమె డోపింగ్ వివాదంలో చిక్కుకోవ‌డం రెండో కార‌ణం. డోపింగ్ లో ప‌ట్టుబ‌డ‌టంతో ఈ క్రీడాకారిణిపై నిషేధం ప‌డింది. ఈమెను అంత‌ర్జాతీయ టెన్నిస్ స‌మాఖ్య నిషేధించింది. దీంతో ష‌ర‌పోవాపై అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న క్రేజ్ చాలా వ‌ర‌కూ మాయ‌మైంది. డోపింగ్ చాలా మంది పై నెగిటివ్ ముద్ర‌ను వేస్తుంది. దీనికి ష‌ర‌పోవా కూడా మిన‌హాయింపు కాలేక‌పోయింది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. అంత‌ర్జాతీయ టెన్నిస్ ను ఒక ద‌శ‌లో ఏలింది ష‌ర‌పోవా. టెన్నిస్ లో ప్రైజ్ మ‌నీలు భారీగా ఉంటాయి. ఇక టెన్నిస్ ప్లేయ‌ర్ల‌కు ఇంట‌ర్నేష‌నల్ ఇమేజ్ కూడా ఉంటుంది. దీంతో వారికి ఎండోర్స్ మెంట్స్ ద్వారా కూడా కోట్ల డాల‌ర్లు ల‌భిస్తాయి. టాప్ స్టేట‌స్ ను ఎంజాయ్ చేసిన ష‌ర‌పోవా ఆ క్రేజ్ ను ఒక ద‌శ‌లో బ్ర‌హ్మాండంగా ఉప‌యోగించుకుంది. దీంతో ఆమె ఆస్తుల విలువ భారీగా పెరిగింద‌ని తెలుస్తోంది.

ఎంత‌లా అంటే.. ఈ టెన్నిస్ ప్లేయ‌ర్ మొత్తం ఆస్తుల విలువ సుమారుగా ల‌క్ష కోట్ల రూపాయ‌లు అని అంచ‌నా! అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు ఈ విష‌యాన్ని ష‌ర‌పోవా రిటైర్ మెంట్ నేప‌థ్యంలో ప్ర‌త్యేకంగా పేర్కొంటూ ఉన్నాయి. ష‌ర‌పోవా ఆస్తుల విలువ భార‌త ద్ర‌వ్య‌మానంలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని - అయితే ఇక ముందు కూడా ష‌ర‌పోవా మార్కెటింగ్ చేసుకోగ‌ల‌ద‌ని ఆమె ఆస్తుల విలువ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా!