తెలుగువాడి ఆత్మగౌరవం: నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్

Sat Oct 01 2022 10:39:40 GMT+0530 (India Standard Time)

Telugu man's self-respect: NTR KCR today

ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల లొల్లి మొదలైంది. గులాబీ నేతలంతా 'దేశ్ కీ నేత' అంటూ హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల సంగతులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేసీఆర్ కొంటున్న విమానం.. జాతీయ సంగతులు అన్నీ గులాబీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు.ఇక కేసీఆర్ ను తెలుగు వారి ఆత్మగౌరవ పతాక అన్న రేంజ్ లో బయటకు ఫోకస్ చేస్తున్నారు. నాడు అన్న నందమూరి తారకరామారావు ఇలానే ఢిల్లీలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఇప్పుడు కేసీఆర్ ను అందుకు అన్వయించి అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అభిమానులు కూడా ఈ క్రమంలోనే కేసీఆర్ ను పొగుడుతున్న పరిస్థితి నెలకొంది.
 
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెప్పుకోదగ్గ ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవచ్చు కానీ ఆ పార్టీకి చాలా నమ్మకమైన ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉంది. ఒక వేళ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఓట్ల శాతం నిజంగానే తెలంగాణలో కీలకంగా ఉంటుంది. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మద్దతు పొందడానికి ప్రయత్నిస్తోంది.

టీఆర్ఎస్ మద్దతుదారుల గ్రూప్ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫ్లెక్సీలో మనకు కేసీఆర్తో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తప్ప మరెవరూ కనిపించరు. "అప్పుడు ఎన్టీఆర్…. ఇప్పుడు కేసీఆర్" అని పోస్టర్ రాసి ఉంది.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరిని దుర్భాషలాడినప్పుడు చాలా మంది టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వైసీపీ నేతల తీరును ఖండించారు.   గీత దాటారంటూ వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు.

తాజాగా ఖమ్మంకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త నారా బ్రాహ్మణిని దూషించి ఆమెపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ను షేర్ చేయడంతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అతడిని చితకబాది గుణపాఠం నేర్పినట్లు తెలిసింది. ఇప్ప టికే టీడీపీ విధేయులకు పార్టీలో టీఆర్ఎస్ పెద్దపీట వేసి మంత్రి పదవులు ఇచ్చింది.  పైన పేర్కొన్న ఫ్లెక్సీలే అందుకు సాక్ష్యంగా పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పాటు టీడీపీ ఓట్లను కూడా దక్కించుకోవాలని టీఆర్ఎస్ చూస్తోందనేది చర్చ సాగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.