ట్రంప్ విధానాలతో తెలుగు టెకీ మృతి

Fri Nov 15 2019 17:06:08 GMT+0530 (IST)

Telugu Techie Dead Because Of Trump Decisions

విదేశీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు దక్కకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెస్తున్న సంస్కరణలు భారతీయుల పాలిట శాపంగా పరిణమించాయి. తాజాగా తెలుగు వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రశాంత్ పండల్.. తన గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ లో పడడంతో మనస్థాపం చెంది గుండెపోటుతో మరణించాడు. అమెరికా సర్కారు గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ జాబితాలో ప్రశాంత్ కూడా పడడంతో ఈ భారతీయ ఐటీ ప్రొఫెషనల్ తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించాడు.  ట్రంప్ విధానాల వల్లే తెలుగు ఇంజినీర్ మరణించాడని అక్కడి ఎన్ఆర్ఐలు మండిపడుతున్నారు.తెలుగు టెక్కీ ప్రశాంత్ నవంబర్ 9న గుండెపోటుతో మరణించాడు. అతడి మరణం ఆయన కుటుంబ సభ్యులను కదిలించింది. నాలుగు నెలల క్రితమే ప్రశాంత్ కు వివాహం అయ్యింది. తెలంగాణకు చెందిన సిందూను ప్రశాంత్ వివాహం చేసుకున్నాడు. ఆమె ఇటీవలే అమెరికాకు వెళ్లింది.

అమెరికాలో టంపాలో ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.  ప్రశాంత్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నిధుల సేకరణను ప్రారంభించింది. గో ఫండ్ మి ప్రచారం సభ్యులు స్నేహితులు అంత్యక్రియల కోసం కావాల్సిన నిధులను ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 58వేల డాలర్లను సేకరించారు.