2024 ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఎఫెక్ట్...!

Tue May 17 2022 10:59:47 GMT+0530 (IST)

Telangana effect on 2024 AP elections ...!

తెలంగాణాకు.. ఏపీకి మధ్య రాజకీయంగా అవినాభావ సంబంధం ఉంది. గతంలోనూ.. ఇప్పుడూ.. రెండు రాష్ట్రాల్లోనూ .. నాయకులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నాయకులు ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారనేది వాస్తవం. ఏపీ నేతలు.. తెలంగాణ రాజకీయాలను ప్రభా వితం చేయకపోయినా.. హైదరాబాద్ సహా.. ఏపీ సరిహద్దు జిల్లాల్లోని రాజకీయాలను నేతలను ప్రజలను ప్రభావితం చేస్తున్నారనేది కూడా నిజమే. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు.. తెలంగాణపై ఆధారపడ్డాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా? అనేది చర్చకు వచ్చింది. తాజా పరిణామాలను గమనిస్తే.. గత ఎన్నికల్లో ఏపీలో తెలంగాణ నేతలు ప్రభావం చూపించారు. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం కనిపిస్తుందా.? అంటే.. కనిపించే సూచనలు లేవు. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జగన్‌కు చాలా వ్యతిరేకంగా ఉంది. అంతేకాదు.. ఆయనపై నా.. ఆయనపాలనపైనా.. తీవ్ర విమర్శలు కూడా చేస్తోంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ఏపీలోని వైసీపీకి సహకరించే అవకాశం లేదని.. మేధావు లు చెబుతున్నారు. అంతేకాదు.. తెలంగాణలో ఒకవేళ అధికార పార్టీ రేపు ఓడిపోతే.. ఈ ప్రభావం.. వైసీపీపైనా ఉంటుందని అంటున్నారు.

ఎందుకంటే.. అనేక సంక్షేమ కార్యక్రమాలు.. ఏపీలో అమలు జరుగుతున్నట్టుగానే తెలంగాణలోనూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సర్కారు కనుక ఓడిపోతే.. ఈ ప్రభావం ఏపీపై పడుతుందని మేధావులు భావిస్తున్నారు.

అలా కాకుండా.. ఏపీలో ప్రభుత్వం గెలవాలంటే.. పొరుగు రాష్ట్ర సహకారం ఖచ్చితంగా ఉండి తీరాలి. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ సహా .. సరిహద్దు జిల్లాల్లో ఓటర్లను తిరిగి ఏపీకి పంపించడంలో.. అధి కార పార్టీ ప్రధానంగా చక్రం తిప్పింది.

తెలంగాణ అధికార పార్టీకి చెందిన నాయకులు బస్సులుపెట్టి మరీ.. ఏపీకి అక్కడ నుంచి ఓటర్లను తరలించారు. ఇదంతా తెరచాటున జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున అక్కడ గెలిచే పార్టీని బట్టి.. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ నిర్ణయం అవుతుందని కూడా మరికొందరు విశ్లేషిస్తున్నారు.