2019 సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చేశాయి .. టాపర్ ఎవరంటే ?

Tue Aug 04 2020 16:20:05 GMT+0530 (IST)

2019 Civil Services Results have arrived .. Who is the Topper?

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన ఫైనల్ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా అందులో సెలెక్ట్ అయినవారికి యూపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగష్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇంటర్వ్యూ ఫలితాలతో పాటు సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మెరిట్ ఆధారంగా విడుదల చేసింది కమిషన్. మొత్తంగా 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.ఈ 829 మందిలో 304 జనరల్ 78 ఈబీసీ 254 ఓబీసీ ఎస్సీ 129 ఎస్టీ 67 మంది సెలెక్ట్ అయ్యారు. కాగా సివిల్ సర్వీస్ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంక్ జతిన్ కిషోర్ రెండవ ర్యాంకు ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్ సాధించారు. ఇక వీరిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ తో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ ఏ గ్రూప్ బీ పోస్టులకు మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇదిలా ఉంటే ఐఏఎస్ పోస్టులు 180 ఉండగా అందులో జనరల్ కేటగిరీలో 72 ఈడబ్ల్యూఎస్ 18 ఓబీసీ 52 ఎస్సీ 25 ఎస్టీకి 13 పోస్టులు ఉన్నాయి. ఐఎఫ్ ఎస్ కు 24 పోస్టులు ఖాళీగా ఉండగా జనరల్ కేటగిరీలో 12 ఈడబ్ల్యూఎస్ 2 ఓబీసీ 6 ఎస్సీ 3 ఎస్టీ 1 పోస్టు ఉంది.

ఇకపోతే ఈ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడు సత్తా చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా 110 ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ను బట్టి చూస్తే మకరంద్‌కు ఐఏఎస్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇక అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.