Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన తెలంగాణ పోలీసులు..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 3:39 PM GMT
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన తెలంగాణ పోలీసులు..!
X
అంతర్జాతీయ భారీ సెక్స్ రాకెట్ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ నిర్వహించి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఈ ముఠా నుంచి ఏకంగా 1419 మంది యువతులకు విముక్తి కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వెబ్ సైట్.. వాట్సాప్.. కాల్ సెంటర్లు.. యాడ్ల పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. గుట్టుచప్పుడుగా అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహించడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 15 నగరాల నుంచి యువతులను రప్పించి సెక్స్ నడుపుతున్నారు. కరీంనగర్.. అనంతపురం నుంచి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు

ఈ క్రమంలోనే పోలీసులు పక్కా ప్రణాళికతో ముఠా సభ్యులపై వల పన్నీ అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. అనంతరం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. ఆర్నవ్.. సమీర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. యువతులకు లగ్జరీ లైఫ్.. ఉద్యోగాల పేరుతో ఆశ చూపి కస్టమర్ల వద్దకు పంపుతున్నారని తెలిపారు.

కొన్ని హోటల్స్ లో ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని వివరించారు. వీరిద్దరిపై గతంలో 39కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. వీరితోపాటు ఈ ముఠాకు చెందిన 17 మంది హ్యూమన్ ట్రాఫికర్స్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు..

ఈ ముఠా చేతిలో 1419 మంది యువతులు ఇరుక్కున్నారని గుర్తించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో మొత్తం 15 నగరాల నుంచి యువతులు పట్టుబడిన వారిలో ఉన్నట్లు తెలిపారు. వీరితోపాటు రష్యా.. బంగ్లాదేశ్..నేపాల్ కు చెందిన విదేశీ అమ్మాయిలు కూడా ఉన్నారని తెలిపారు. కొందరిని విమానాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోని కస్టమర్ల వద్దకు పంపుతున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

ఆర్నావ్ అనే వ్యక్తి 915మంది యువతులను ముంబై, కోల్‌కతా నుంచి సప్లై చేయగా.. సమీర్ అనే వ్యక్తి 850 మంది యువతులను తీసుకొచ్చాడని సీపీ తెలిపారు. అమ్మాయిలకు లగ్జరీ లైఫ్.. ఉద్యోగాల ఆశచూపి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని విచారణలో వెల్లడైంది. ఈ భారీ ఆపరేషన్లో పట్టుబడిన యువతలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రుల వద్దకు పంపించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.