భారత్ బయోటెక్ లో గవర్నర్ తమిళిసై !

Tue Sep 29 2020 23:04:17 GMT+0530 (IST)

Governor Tamilsai at Bharat Biotech!

శామీర్ పేట లోని భారత్ బయోటెక్ సంస్థను ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో శ్రమిస్తున్న ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నాని తెలిపారు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ పై అత్యంత శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారని తెలిపారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరిని నిర్మూలించడానికి శాస్త్రవేతలతో పాటు వ్యాక్సిన్ తయారీకి శ్రమిస్తున్న ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.ప్రధాని మోదీ చెప్పినట్లు భారత్ లోనే కరోనా వ్యాక్సిన్ తయారీకి అవకాశాలు ఎక్కువ అని వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టారని చెప్పారు. తన పర్యటన ముఖ్య ఉద్దేశం కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని మరింత ఏకాగ్రతతో ముందుకుసాగేలా ప్రేరేపించడమేనని అన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తయారు చేస్తున్న 'కొవాగ్జిన్' త్వరలో అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనంతరం గవర్నర్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలు ఎంతో శ్రద్ధ పెట్టి పని చేస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్టు దేశంలో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. 2020 లోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.