Begin typing your search above and press return to search.

ఏమంది కేసీఆర్? ఫార్మర్ హౌస్ నుంచి బయటకు రావట్లేంది?

By:  Tupaki Desk   |   15 May 2022 4:05 AM GMT
ఏమంది కేసీఆర్? ఫార్మర్ హౌస్ నుంచి బయటకు రావట్లేంది?
X
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? అంటే.. విచిత్రంగా ఒక చూపు చూసి ఇంకెక్కడ ఉంటారు ముఖ్యమంత్రి కార్యాలయంలో. సీఎం అధికార నివాసంలో అన్న మాట జవాబుగా రావటమే కాదు.. ఈ మాత్రం కూడా తెలీదా? అంటూ చులకన చూపు ఒకటి మీద పడటం ఖాయం. కానీ.. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని అలవాటు ఒక సీఎంకు ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి సెక్రటేరియట్ కు వెళ్లకుండా.. తన అధికార నివాసంలో కూడా పెద్దగా ఉండకుండా తనకు సొంతమైన ఫాంహౌస్.. అదేనండి ఫార్మర్ హౌస్ కు పరిమితమయ్యే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపు పొందారు.

తాను ఉండేది ఫాంహౌస్ లో కాదు.. ఫార్మర్ హౌస్ లో అంటూ తరచూ వ్యాఖ్యలు చేసే కేసీఆర్.. సెక్రటేరియట్ కు రావట్లేదన్న మాట విషయంలో గయ్యి మంటారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సీఎంవో అని తేల్చేసే ఆయన.. మరి.. దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఫార్మాట్ ను ఎందుకు ఫాలో కావట్లేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించని పరిస్థితి. ఈ విషయం ఇలా ఉంటే.. తాజాగా ఒక అంశం ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

ఎప్పటి మాదిరి అయితే కొద్ది రోజులు ప్రగతిభవన్ లో ఉండే కేసీఆర్.. మరికొద్ది రోజులు ఫాంహౌస్ లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే అక్కడికి ఇక్కడికి షటిల్ కొడుతుంటారు. ఆయన ఇంట్లోనుంచి కాలు బయటకు అడుగు పెట్టినంతనే సిద్ధంగా ఉండే వాహన సముదాయం కారణంగా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలుగదనే చెప్పాలి.

ఇక.. ప్రగతిభవన్ లో ఉన్నా.. ఫార్మర్ హౌస్ లో ఉన్నా.. తన పని తాను చేస్తున్నప్పుడు.. ఎక్కడ ఉన్నాననే చర్చ అవసరమా? అన్న ప్రశ్న కేసీఆర్ నోటి నుంచి వినిపిస్తూ ఉంటుందని చెబుతారు. ఎప్పుడూ లేనిది ఈసారి సీఎం ఫార్మర్ హౌస్ లో ఉండటం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటి? అంటే దానికో కారణం లేకపోలేదు.

రోటీన్ కు భిన్నంగా గడిచిన పదిహేను రోజలుగా (సుమారుగా) సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫార్మర్ హౌస్ కే పరిమితమయ్యారని చెబుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా సంపన్న రాష్ట్రంగా గొప్పలు చెప్పే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. రాజధాని నగరంలో లేకుండా ఎక్కడో మూలన ఉండే ఎర్రవెల్లి ఫార్మర్ హౌస్ లో ఉండటం ఎంతవరకు సబబు? అన్నది

అయితే.. ఏదో ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టటానికి ముందు.. దీర్ఘకాలం ఫార్మర్ హౌస్ లో ఉండటం కేసీఆర్ కు అలవాటుగా చెబుతారు. అదే నిజమైతే.. గడిచిన రెండు వారాలకు పైనే ఫార్మర్ హౌస్ కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు? ఏ అంశం గురించి మధనం చేస్తున్నారు. అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కాలమే సరైన సమాధానం ఇస్తుందని చెప్పాలి.