Begin typing your search above and press return to search.

అమెరికా నుండి హైదరాబాద్ కి టెక్ మహీంద్రా ఉద్యోగులు , వారి కుటుంబాలు !

By:  Tupaki Desk   |   14 July 2020 11:15 AM GMT
అమెరికా నుండి హైదరాబాద్ కి టెక్ మహీంద్రా ఉద్యోగులు , వారి కుటుంబాలు !
X
కేవలం పనిచేపించుకున్నామా ..దానికి సరిపడా జీతం ఇచ్చామా అని చేతులు దులిపేసుకునే ఎన్నో కంపెనీలు ఉన్న ఈ సమాజంలో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల క్షేమం కూడా తమ భాద్యతే అని అనుకునే కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. అమెరికా తో పాటుగా పలు దేశాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన ఉద్యోగుల్ని పలు సంస్థలకు ఇండియాకి తీసుకువస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా అమెరికాలో నిలిచిపోయిన 200 మంది ఉద్యోగుల్ని, వారి కుటుంబాలని గత వారం ఇన్సోసిస్ భారత్ తీసుకు వచ్చింది. తాజాగా మరో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా కూడా ప్రత్యేక విమానంలో తమ ఉద్యోగులను ఇండియాకి తరలించింది.

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల 210 మంది సిబ్బంది, వారి కుటుంబం అమెరికాలో చిక్కుకుపోయింది. వారిని హైదరాబాద్ తీసుకు వస్తున్నట్లు టెక్ మహీంద్రా నిన్న వెల్లడించింది. వీరందరూ కూడా అమెరికాలోని డల్లాస్, ఫోర్ట్ వర్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లు తెలిపింది. వీరందరూ ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకుంటారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు ఎక్కడ ఉన్నావారికి అన్ని విధాలా సహాయంగా నిలుస్తున్నామని ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.

ఇటువంటి క్లిష్ట సమయంలో తమ కంపెనీ ఉద్యోగుల భద్రత కోసం చేస్తున్న ప్రయత్నాల పట్ల టెక్ మహీంద్రా ఉద్యోగులు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. మెరికాలో చిక్కుకుపోయిన 210 మంది ఉద్యోగులు, కుటుంబాలను అమెరికా నుండి చార్టర్డ్ విమానంలో ఇండియాకు తీసుకు వస్తున్నట్లు ఓ ఉద్యోగి ట్వీట్ చేశారు. ఇంటికి రావడం, సురక్షితంగా ఉన్నామనే భావన.. ఈ భావోద్వేగాన్ని ఏవీ భర్తీ చేయలేవని, ముఖ్యంగా కరోనా-లాక్ డౌన్ కాలంలో అని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ట్వీట్ చేశారు.