భరణం విషయంలో టీమిండియా క్రికెటర్‌కు భారీ షాక్..!

Tue Jan 24 2023 12:41:05 GMT+0530 (India Standard Time)

Team India player Shami in court How much should be paid

టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ షమీకి కోర్టులో చుక్కెదురైంది. మహ్మద్ షమీ.. అతడి భార్య హసిన్ జవాన్ మధ్య ఐదేళ్లుగా న్యాయ పోరాటం నడుస్తోంది. ఈ క్రమంలోనే షమీ భార్య హసీన్ కు భరణం విషయంలో అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు షమీ తన భార్య హసిన్ జవాన్ కు ప్రతినెలా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 2014లో మహ్మద్ షమీ.. హసిన్ వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ కూతురు ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో హసీన్ 2018 ఆగస్టు 16న షమీ వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించారు. షమీపై అత్యాచారం.. హత్యాయత్నం.. గృహ హింస తదితర అభియోగాలను మోపింది.

అదే సమయంలో తన కుమార్తె ఖర్చు నిమిత్తం తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. తన కుమార్తె పోషణ కోసం నెలకు రూ.10లక్షలు అందిచాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

అయితే దీనిని కోర్టు నాడు తిరస్కరించింది. షమీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని భరణం చెల్లించాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు షమీ తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ భరణంగా ఒక లక్షా 30వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 50 వేలు హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. తన భార్యతో ఉంటున్న కూతురు ఐరా షమీ పోషణ నిమిత్తం మరో రూ.80 వేలు ఖర్చు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ భరణం విషయంలో హసిన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ భరణం మొత్తం ఎక్కువగా ఉంటే తాను రిలీవ్ అయ్యేవారమని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారంగా హసిన్ దీనిపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయడానికి ఆలోచిస్తుందని సమాచారం. కాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై షమీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.