Begin typing your search above and press return to search.

కరోనా ట్రీట్మెంట్ లో అద్భుత ఫలితాలిస్తున్న టీకోప్లానిన్ !

By:  Tupaki Desk   |   29 Sep 2020 11:10 AM GMT
కరోనా ట్రీట్మెంట్ లో అద్భుత ఫలితాలిస్తున్న టీకోప్లానిన్ !
X
కరోనా‌ చికిత్సలో టీకోప్లానిన్‌ అనే డ్రగ్‌ తో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమ స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్స్‌ పరిశోధన లో వెల్లడైంది. ఈ డ్రగ్‌ ఇప్పటికే క్లినికల్‌ గా ఆమోదం పొందింది. కరోనా వైద్యంలో భాగంగా ఉపయోగిస్తున్న ఇతర ఔషధాల కంటే టీకోప్లానిన్‌ దాదాపు 20 రెట్లు ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు గుర్తించామని ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్‌ అశోక్‌ పటేల్‌ తెలిపారు. 23 ఆమోదిత ఔషధాల మిశ్రమంతో టీకోప్లానిన్‌ డ్రగ్‌ ను తయారుచేశారు.

తాజా పరిశోధన వివరాలను అంతర్జాతీయ పత్రిక బయోలాజికల్‌ మాక్రోమాలిక్యూల్స్‌లో ప్రచురించారు. టీకోప్లానిన్ ‌పై ఇంకా కొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రొఫెసర్‌ అశోక్‌ పటేల్‌ తెలిపారు. కాగా, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే నాసల్‌ స్ర్పే తో కరోనాను తగ్గించవచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆస్ట్రేలియా బయోటెక్‌ కంపెనీ ఎనా రెస్పిరేటరీ జంతువుల మీద చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నాసల్‌ స్ప్రే వాడకంతో కరోనా వైరస్‌ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇక దేశంలో గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది. దేశ వ్యాప్తంగా 9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి.