రైతుల గురించి సత్వర నిర్ణయం తీసుకోవాలన్న సోమిరెడ్డి !

Sat Dec 05 2020 15:01:41 GMT+0530 (IST)

Tdp Uturn Politics On Farmers

వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యాపారుల సముచిత పాత్రకు వీలు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా గత 9 రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రం రైతులతో రెండు దఫాలుగా చర్చలు కూడా జరిపింది. కానీ ఆ సమస్య ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రంగంలోకి  దిగారు. ఈ రోజు   రైతులతో కేంద్రం మూడో విడత చర్చలు జరపబోతుంది.రైతుల ఆందోళన పై కేంద్రం అంతగా స్పందించలేదు. కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇప్పటికే  ఈ నెల 8న భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. దీంతో రైతుల నిరసనల సెగ ఇప్పుడు అన్ని పార్టీలనూ తాకుతోంది. ముఖ్యంగా గతంలో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చిన టీడీపీ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంది. ఢిల్లీలో రైతుల పోరాటంపై టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ 9 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారని వారు ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్నారని సోమిరెడ్డి తెలిపారు.

అధికారులు భోజన సౌకర్యం కల్పిస్తామన్నా నిరాకరించి పట్టుదలగా రైతులు ఉద్యమిస్తున్నారని సోమిరెడ్డి ప్రశంసించారు. కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ బిల్లులు తెచ్చిందో తెలియదు కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని   ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలన్నారు. రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులతో వ్యవహరించి సత్వర నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు.