Begin typing your search above and press return to search.

తౌక్తే తుఫాను బీభ‌త్సం.. నాలుగు రాష్ట్రాల్లో అల్ల‌క‌ల్లోలం!

By:  Tupaki Desk   |   16 May 2021 1:30 PM GMT
తౌక్తే తుఫాను బీభ‌త్సం.. నాలుగు రాష్ట్రాల్లో అల్ల‌క‌ల్లోలం!
X
దేశం యావ‌త్తూ కొవిడ్ సంక్షోభంలో మునిగిపోయింది. క‌రోనా దాడిని త‌ట్టుకోలేక అత‌లాకుత‌లం అవుతోంది. ఇలాంటి స‌మ‌యంలోనే ప్ర‌కృతి విప్త‌తులు కూడా దాడి చేస్తున్నాయి. అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన తౌక్తే తుఫాను ప్ర‌స్తుతం గోవాకు నైరుతిలో 170 కిలోమీట‌ర్లు, ముంబైకి 520 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది.

ఈ తుఫాను ఈ నెల‌ 18వ తేదీన‌ తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే.. తీరం దాట‌డానికి రెండు రోజుల ముందుగానే ప్ర‌తాపం చూపిస్తుండ‌డంతో.. తీరం దాటే స‌మ‌యంలో ఇంకెంత ప్ర‌భావం చూపుతుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం ఈ తుఫాను ప్ర‌భావం మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, క‌ర్నాట‌క‌, గోవా రాష్ట్రాల్లో అధికంగా ఉంది. క‌ర్నాట‌క‌లోని ఆరు జిల్లాలో ఈ తుఫాను బీభ‌త్సం సృష్టిస్తోంది. ఈ జిల్లా ప‌రిధిలోని సుమారు 70కిపైగా గ్రామాల్లో తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని, న‌లుగురు ప్రాణాలు కోల్పోయార‌ని క‌న్న‌డ విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారులు ప్ర‌క‌టించిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, గోవాలోని చాలా ప్రాంతాల్లో వ‌ర్ష బీభ‌త్సం కార‌ణంగా.. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఈ తుఫానుపై కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రుల‌తో హోం మంత్రి అమిత్ షా స‌మీక్ష నిర్వ‌హించిన‌ట్టు స‌మాచారం. తుఫాను విల‌యాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.