పర్యావరణనిపుణుడు అంతమంది ప్రాణాలుతీశాడు

Sat Dec 05 2015 14:44:27 GMT+0530 (IST)

Tashfeen Malik and Syed Rizwan in San Bernardino shooting

అమానుషంగా కాల్పులు జరిపి 14 మంది నిండు ప్రాణాలు తీసిన అమెరికా జంటకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా.. ఆయుధాలు ధరించి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీయటం తెలిసిందే.ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని.. స్వల్ప వ్యవధిలోనే పోలీసులు కాల్చి చంపేయటం తెలిసిందే. ఐఎస్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్న ఈ ఇద్దరి విషయానికి వస్తే.. ఒకరు రిజ్వాన్ ఫారూక్.. తష్ఫీన్ మాలిక్ గా చెబుతున్నారు. వీరికి ఆర్నెల్ల పాప కూడా ఉండటం గమనార్హం. ఫారూక్ విషయానికి వస్తే.. ఇతగాడు పర్యావరణ ఆరోగ్య నిపుణుడు.పర్యావరణాన్ని సంరక్షించేందుకు కృషి చేసే ఇతడు.. ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీయటం గమనార్హం.

మరోవైపు.. వీరిద్దరూ భార్యభర్తలని.. పథకం ప్రకారమే కాల్పుల దారుణానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. వీరి ఆర్నెల్ల పాపను ఫారూక్ తల్లి వద్ద వదిలేసి.. తాము డాక్టర్ వద్దకు వెళుతున్నామని చెప్పి..ఈ దారుణానికి పాల్పడినట్లుగా ఆమె తల్లి వాపోతోంది. దుర్మార్గానికి పాల్పడిన వారి సంగతి సరే.. వారి కారణంగా అభం శుభం తెలీని ఆర్నెల్ల చిన్నారి..  ఫారూక్ తల్లి.. కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి..? ఉన్మాదంతో రాక్షసంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు తీసి.. తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు..అయిన వారికి మాత్రం అంతులేని శోకాన్ని.. సమస్యల్ని తెచ్చి పెట్టారని చెప్పక తప్పదు.