Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు మిగిలింది 529 రోజులే: బీజేపీ నేత‌ సంచ‌ల‌న కామెంట్స్‌

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
కేసీఆర్‌కు  మిగిలింది 529 రోజులే:  బీజేపీ నేత‌ సంచ‌ల‌న కామెంట్స్‌
X
టీఆర్ ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఇంకా 529 రోజులు మాత్రమే సీఎం కేసీఆర్కు సమయం ఉందన్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని.. కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని తరుణ్చుగ్ ఆరోపించారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40 దొంగల తీరుగా మారి.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

టీఆర్ ఎస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న తరుణ్చుగ్.. కేసీఆర్ పాలనపై "సాలు దొర.. సెలవు దొర" వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 529 రోజులు మాత్రమే సీఎం కేసీఆర్కు సమయం ఉందని.. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని తరుణ్చుగ్ పేర్కొన్నారు. జులై 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో భారీ సభ నిర్వహిస్తున్నామన్న ఆయన.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికే ఈ సభ పెడుతున్నామని స్పష్టం చేశారు.

``తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. దళిత బంధు ఏమైంది, 2 పడక గదుల ఇళ్లు ఏమయ్యాయి. కేసీఆర్ పాలనపై 'సాలు దొర-సెలవు దొర' వెబ్సైట్ ప్రారంభిస్తున్నాం. జులై 3న పరేడ్ గ్రౌండ్లో భారీ సభ ఉంది. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఏర్పాట్లు చేస్తున్నాం``. అని త‌రుణ్ చుగ్ అన్నారు.

మోడీ రాక‌.. షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు మోడీ, జేపీ నడ్డా వస్తున్నారు. జులై 2న మోడీ హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు.

జులై 2, 3 తేదీల్లో మోడీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు. జులై 1న మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్‌లో కిలోమీటరు దూరం నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు.