విజయన్..స్టాలిన్ .. ఓ దళపతి

Tue May 04 2021 11:00:34 GMT+0530 (IST)

Tamilnadu Assembly Elections 2021

అవును కేరళలో రెండోసారి ఎన్నికల్లో గెలిచిన పినరయి విజయన్ను తమిళనాడులో మొదటిసారి గెలిచిన స్టాలిన్ను కొందరు అభిమానులు ‘దళపతి జోడి’తో పోల్చారు. 1990ల్లో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన దళపతి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ సినామా పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఎందుకంటే తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్+కేరళలో సూపర్ స్టార్ మమ్ముటి నటించటమే కారణం. ఆ సినిమాలో మమ్ముటి పాత్రపేరు దేవా కాగా రజనీకాంత్ పాత్ర పేరు సూర్య.మరి ఎవరు చేశారో తెలీదుకానీ ఎంకే స్టాలిన్ను విజయన్ ఫొటోలను దళపతి సినిమా జోడి  మమ్ముట్టి రజనీ స్టైల్లో మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో ఉంచారు. ఇంకేముంది అసలే స్టాలిన్ను తమిళనాడులో అందరు దళపతి అంటారు. దాంతో రెండు ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయాయి. ఇద్దరు కూడా తమ రాష్ట్రాల్లో బీజేపీతో పోరాడి గెలవటంతో వీళ్ళద్దరికి మరింత క్రేజు పెరిగిపోయింది. ఇదే సమయంలో దళపతి సినిమా స్టైల్ ఫొటో కనబడటంతో ఇక చెప్పేదేముంది ?

ఇద్దరి ఫొటోల్లో స్టాలిన్ ఫొటో రజనీ స్టైలుకు కాస్త దగ్గరలోనే ఉంది. అంటే మార్ఫింగ్ చేసిన వారెవరో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. కాబట్టి మార్ఫింగ్ చేసిన వాళ్ళు తమిళనాడుకు చెందిన వాళ్ళే అని అనుమానిస్తున్నారు. ఏదేమైనా నెటిజన్ల సృజనాత్మకత ఇపుడు మిగిలిన వాళ్ళను బాగా ఆకట్టుకుంటోంది.